Bigg Boss7: బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన షకీలా పారితోషకం ఎంతో తెలుసా..?

బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన షకీలా.. తాజా ఇంటర్వ్యూలో కంటెస్టెంట్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ 7 సీజన్ ప్రారంభమై రెండు వారాలు ముగియడంతో హౌస్ నుంచి ఇద్దరు బయటకు వచ్చేశారు. తొలి వారంలో మాజీ హీరోయిన్ కిరణ్‌ రాథోడ్ బయటకు రాగా.. రెండో వారంలో షకీలా ఎలిమినేట్ అయ్యారు.

New Update
Bigg Boss7: బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన షకీలా పారితోషకం ఎంతో తెలుసా..?

Bigg Boss7: బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన షకీలా.. తాజా ఇంటర్వ్యూలో కంటెస్టెంట్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ 7 సీజన్ ప్రారంభమై రెండు వారాలు ముగియడంతో హౌస్ నుంచి ఇద్దరు బయటకు వచ్చేశారు. తొలి వారంలో మాజీ హీరోయిన్ కిరణ్‌ రాథోడ్ బయటకు రాగా.. రెండో వారంలో షకీలా ఎలిమినేట్ అయ్యారు. అయితే హౌస్ నుంచి త్వరగానే బయటకు వచ్చిన ఆమె మాత్రం పాజిటివ్ ఇమేజ్ తెచ్చుకున్నారు. హౌస్‌లోని కంటెస్టెంట్స్‌తో హుందాగా వ్యవహరించి అందరి చేత అమ్మగా పిలిపించుకున్నారు. అయితే వయసు రీత్యాల షకీలా కొన్ని టాస్కులు సరిగా చేయకపోవడం.. అందరితో సరదాగా ఉండకపోవడం ఆమెకు ఓటింగ్ రీత్యా కొంత మైనస్‌గా మారింది.

ఈ కారణం చేతనే షకీలా ఎలిమినేట్ అయ్యారు. ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చే సమయంలో అమర్‌దీప్, టేస్టీ తేజ, మరికొందరు ఏడుస్తూ ఎమోషనల్ అయ్యారు. అయితే షకీలా బిగ్‌బాస్‌లోకి వెళ్లేందుకు ఎంత పారితోషకం తీసుకుందోననే చర్చ నడుస్తోంది. బిగ్‌బాస్‌ నిర్వాహకులు సాధారణంగా పాపులారిటీ, క్రేజ్‌ను బట్టి కంటెస్టెంట్స్‌కు పారితోషకం ఫిక్స్‌ చేస్తారు. శృంగారతారగా పాపులారిటీ ఉన్న షకీలాకు వారానికి రూ.3. 5 లక్షలు ఇచ్చారట. అయితే రెండో వారంలోనే హౌస్ నుంచి బయటకు రావడంతో షకీలాకు రూ. 7 లక్షల రెమ్యునరేషన్‌ ముట్టిందని తెలుస్తోంది.

హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన షకీలా.. తాజాగా గలాటా గీతూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంటెస్టెంట్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు..

శివాజీ: ఈ హౌస్‌లో బ్యాక్ బోన్. నాకు అన్న. నాకు మరో జన్మ ఉంటే.. ఈ అన్నకి చెల్లెలిగా పుట్టాలి.

శోభాశెట్టి: ఇప్పటి వరకూ మాస్క్‌తోనే ఆడుతుంది. బద్దకం ఎక్కువ.. హౌస్‌లో ఉంటున్నా అనే బాధ్యతగా ఉండదు. తనకి తెలియకుండానే ప్రభావితం అయిపోతుంది. రతిక బాగా ఇన్‌ప్ల్యూయెన్స్ చేస్తుంది.

రతిక: ఈమె చాలా డేంజర్. అందమైన పాము. ఎవరితోనూ ఐ కాంటాక్ట్ పెట్టుకోదు. అందరినీ త్వరగా ఇన్‌ప్ల్యూయెన్స్ చేస్తుంది. హౌస్‌లో ఉన్న వాళ్లు ఈమె దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి.

పల్లవి ప్రశాంత్: వీడిది బ్లడీ రాంగ్ యాటిట్యూడ్. వచ్చిన రోజు చెప్పులు బయట తీసేసి వచ్చాడు.. రెండోరోజు చెప్పులు కాస్త దగ్గర పెట్టాడు.. మూడోరోజు చెప్పులు వేసుకుని కాలు మీద కాలు వేసుకుని ఆడిస్తున్నాడు. నీ కాలు నువ్వు ఆడించుకోవచ్చు తప్పులేదు. కానీ నిన్ను ఓ ఇమేజ్‌‌తో తీసుకుని వచ్చేశారు. వాడికి పాపులారిటీ అనే నిషా బాగా ఎక్కేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడు.

అమర్ దీప్: అమర్ దీప్ చాలా సెన్సిటివ్. ప్రేమ కోసం తపిస్తుంటాడు. చిన్న విషయానికి కూడా తట్టుకోలేడు. ఫేక్ కాదు.

ప్రిన్స్ యావర్: వీడి వల్లే నేను నామినేట్ అయ్యాను.. ఎలిమినేట్ అయ్యాను. బాడీ ఉంది కానీ.. బుర్ర లేదు. బాడీతో ఎదిగిపోవాలంటే కాదు.. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ.. స్టుపిడ్.

గౌతమ్ కృష్ణ: వీడిని అనాలి ప్రిన్స్. మంచి నేచర్.. గుడ్ బాయ్. వాడిని కన్న తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు. వాడు చాలా మంచివాడు.

దామిని: హౌస్‌లో ఉన్న వాళ్లలో ది బెస్ట్ దామిని. ఓపెన్‌గా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే దామిని ఏంజెల్.

సందీప్: చాలా కష్టపడతాడు. జెన్యూన్..

శుభశ్రీ: ఈమె మేనిప్యులేటర్. జడ్జి చేయడం కష్టం..

ఇది కూడా చదవండి: రీరిలీజ్‌కు సిద్ధమైన మరో క్లాసిక్ మూవీ.. థియేటర్లలో సందడి చేయనున్న హ్యాపీడేస్

Advertisment
Advertisment
తాజా కథనాలు