Naga Chaitanya – Sobhita : నాగచైతన్య - శోభిత మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా? అక్కినేని నాగ చైతన్య - శోభిత దూళిపాళ ఎట్టకేలకు తమ బంధాన్ని అధికారికం చేశారు. నేడు ఎంగేజ్ మెంట్ చేసుకొని అందిరికీ షాక్ ఇచ్చారు. అయితే వీరి మధ్య 6 ఏళ్లు ఏజ్ గ్యాప్ ఉన్నట్టు తెలుస్తోంది. 1986 లో నాగ చైతన్య జన్మించగా.. 1992 లో శోభిత పుట్టింది. By Anil Kumar 08 Aug 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Naga Chaitanya – Sobhita : టాలీవుడ్ (Tollywood) లో గత కొంతకాలంగా సీక్రెట్ రిలేషన్ షిప్ మైంటైన్ చేస్తూ వచ్చిన అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) - శోభిత దూళిపాళ (Sobhita Dhulipala) ఎట్టకేలకు తమ బంధాన్ని అధికారికం చేశారు. నేడు (ఆగస్టు 8) ఈ జంట ఎంగేజ్ మెంట్ (Engagement) చేసుకొని అందిరికీ షాక్ ఇచ్చారు. వీరి నిశ్చితార్థ వేడుక నాగార్జున ఇంట్లో చాలా సింపుల్ జరిగింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. నాగార్జున.. ట్విట్టర్ లో ఫోటోలు రిలీజ్ చేశారు. కాగా సోషల్ మీడియా వేదికగా అక్కినేని అభిమానులతో పాటు.. సెలబ్రిటీలు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ఉన్నట్టుండి వీరిద్దరూ ఎంగేజ్ మెంట్ చేసుకోవడంతో వీరి పరిచయం, ప్రేమ గురించి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో డిస్కషన్ నడుస్తోంది. "We are delighted to announce the engagement of our son, Naga Chaitanya, to Sobhita Dhulipala, which took place this morning at 9:42 a.m.!! We are overjoyed to welcome her into our family. Congratulations to the happy couple! Wishing them a lifetime of love and happiness. 💐… pic.twitter.com/buiBGa52lD — Nagarjuna Akkineni (@iamnagarjuna) August 8, 2024 Also Read : నాగచైతన్య - శోభిత ఫస్ట్ టైమ్ ఎక్కడ కలుసుకున్నారో తెలుసా? వీరి మధ్య ఏజ్ గ్యాప్ గురించి కూడా చర్చ జరుగుతోంది. అయితే వీరి మధ్య 6 ఏళ్లు ఏజ్ గ్యాప్ ఉన్నట్టు తెలుస్తోంది. 1986 లో నాగ చైతన్య జన్మించగా.. 1992 లో శోభిత పుట్టింది. ఈ జంట మధ్య ఆరేళ్ళ గ్యాప్ ఉందని తెలిసి నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. #naga-chaitanya-sobhita మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి