Lakshmi Devi: లక్ష్మీదేవి కటాక్షించాలంటే సంక్రాంతికి ఈ పనులు చేయండి

మకర సంక్రాంతి రోజున పవిత్ర నదులలో స్నానం, పితృ తర్పణం చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతులు లభిస్తాయి. చీపురు కొనడం, నువ్వుల దానం, ఆవుకు పచ్చిమేత, సూర్యభగవానుడు, శనిదేవుని ఆరాధన చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.

New Update
Lakshmi Devi: లక్ష్మీదేవి కటాక్షించాలంటే సంక్రాంతికి ఈ పనులు చేయండి

Lakshmi Devi: మకర సంక్రాంతికి హిందూమతంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు నుంచి అన్ని శుభకార్యాలు ప్రారంభమవుతాయి అందరి నమ్మకం. మకర సంక్రాంతి రోజున చేసే నదీస్నానం, దానధర్మాలు, పూజలు ఎంతో పుణ్యాన్ని కలిగిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున ఏదైనా దానం చేస్తే ఫలితాలు రెట్టింపు అవుతుందని పూర్వ నుంచి కొనసాగుతుంది.అందుకే.. ఈ రోజున పూజలు, దానాలు, నదీస్నానాలు ఎక్కువగా చేయటానికి ఇష్ట పడుతారు. అంతే కాదు మకర సంక్రాంతి రోజున కొన్ని పనులను చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. మకర సంక్రాంతి రోజున కొన్ని పనులు తప్పక చేయాలని కూడా పండితులు చెబుతున్నారు. ఆ పనులు ఏమిటో..? ఏ సమయంలో చేయాలో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

పవిత్ర నదిలో స్నానం:

  • మకర సంక్రాంతి రోజున పవిత్ర నదులలో స్నానం చేస్తే మంచిది. ఈ రోజున గంగామాత భూమిపైకి వచ్చిందని ప్రతీతి. అందుకే మకర సంక్రాంతి రోజు గంగానదిలో స్నానం చేస్తే పుణ్యమని భావిస్తారు.

నువ్వుల గింజలతో హవనం:

  • మకర సంక్రాంతి రోజున ఆవునెయ్యిలో తెల్లనువ్వులను కలిపి లక్ష్మీదేవి శ్రీ సూక్త హవనం చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది. ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.

పిత్రు తర్పణం:

  • మకర సంక్రాంతి రోజున పితృ తర్పణం చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతులు, పూర్వీకుల ఆశీస్సులు వంశాభివృద్ధిని పెంపొందిస్తుందని నమ్మకం.

చీపురు కొనడం:

  • మకర సంక్రాంతి రోజున చీపురు కొనడం కూడా శుభప్రదం. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది భక్తులు నమ్ముతారు.

నువ్వుల దానం:

  • మకర సంక్రాంతి రోజున నలుపు, తెలుపు నువ్వులు, బెల్లం తేనె రెండింటినీ దానం చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయట.

ఆవుకు పచ్చిమేత:

  • ఆవును లక్ష్మీ దేవిగా పూజిస్తారు. మకర సంక్రాంతి రోజున ఆవుకు పచ్చిమేత తినిపిస్తే సంతోషం, సౌభాగ్యం పెరుగుతాయి.

ఖిచ్డీ దానం:

  • మకర సంక్రాంతి రోజున ఖిచ్డీని తయారు చేయడం, తినడం, దానం చేసినా లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. ఈ రోజున ఖిచ్డీని పూజలో నైవేద్యంగా పెట్టి, ప్రసాదంగా తిని, ఖిచ్డీని దానం చేస్తే సర్వదోషాలు తొలగిపోతాయని నమ్మకం ఉంది.

సూర్యభగవానుడు, శనిదేవుని ఆరాధన:

  • మకర సంక్రాంతి రోజున సూర్య భగవానుడి,శని దేవుడిని ఆరాధించడం వలన ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతికి దారితీస్తుంది. కష్టాల నుంచి ఉపశమనం ఉంటుందని నమ్ముతారు.

ఇది కూడా చదవండి: నల్ల పసుపుతో కలిగే అద్భుత ప్రయోజనాలు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు