Beauty Tips: పీరియడ్స్ కారణంగా ముఖంపై మొటిమలు వస్తున్నాయా? ఇలా వదిలించుకోండి!

పీరియడ్స్ సమయంలో ముఖంపై మొటిమలు ఒక సాధారణ సమస్య. అవి హార్మోన్ల మార్పుల వల్ల సంభవిస్తాయి. మొటిమలను వదిలించుకోవడానికి ముఖాన్ని రోజుకు 2 నుంచి 3 సార్లు కడగాలి. నూనె, మాయిశ్చరైజర్, టీ ట్రీ ఆయిల్‌, మంచును ఉపయోగించాలి. మేకప్ వేసుకోవడం మానుకోవాలి.

New Update
Beauty Tips: పీరియడ్స్ కారణంగా ముఖంపై మొటిమలు వస్తున్నాయా? ఇలా వదిలించుకోండి!

Pimples: మహిళలకు పీరియడ్స్ కారణంగా ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతు ఉంటాయి. వీటిని వదిలించుకోవాటనికి తీవ్ర ప్రయత్నాలు చేస్తారు. చాలా సార్లు హార్మోన్ల మార్పుల వల్ల పీరియడ్స్ సమయంలో అమ్మాయిల ముఖంపై మొటిమలు రాస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇది వారి అందాన్ని తగ్గిస్తుంది. అటువంటి సమయంలో కొన్ని చిట్కాలను అనుసరిస్తే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. పీరియడ్స్ సమయంలో ముఖంపై మొటిమలు కనిపించడం ప్రారంభిస్తే ముఖంపై మొటిమలు తగ్గించే చిట్కాల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

పీరియడ్స్‌ సమయంలో ముఖంపై మొటిమలకు నివారణ:

  • పీరియడ్స్ సమయంలో ముఖంపై మొటిమలు ఒక సాధారణ సమస్య. అవి హార్మోన్ల మార్పుల వల్ల సంభవిస్తాయి.
  • ఆడపిల్లలకు పీరియడ్స్ రావడానికి కొన్ని రోజుల ముందు మొటిమలు రావడం ప్రారంభిస్తాయి. దీన్నే రుతుక్రమంలో మొటిమలు అంటారు.
  • మొటిమలను నివారించడానికి, వదిలించుకోవడానికి ముఖాన్ని రోజుకు 2 నుంచి 3 సార్లు కడగాలి. నూనె, మాయిశ్చరైజర్ ఉపయోగించాలి.
  • పీరియడ్స్ సమయంలో టీ ట్రీ ఆయిల్‌ని ఉపయోగించవచ్చు. ఇది మొటిమలతో పోరాడడంలో సహాయపడుతుంది.
  • అంతేకాకుండా మంచును ఉపయోగించవచ్చు. ఇది మొటిమలను, వాపును తగ్గిస్తుంది.
  • పీరియడ్స్ సమయంలో మేకప్ వేసుకోవడం మానుకోవాలి. అది మరింత చర్మ సమస్యలను కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: రోజూ ఒక దానిమ్మపండు తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే!

Advertisment
Advertisment
తాజా కథనాలు