Movie Scenes : హీరోహీరోయిన్‌ నిజంగానే ముద్దు పెట్టుకుంటారా? రొమాంటిక్ సీన్స్‌ని ఎలా షూట్ చేస్తారు?

హీరోహీరోయిన్లు నిజంగానే ముద్దు పెట్టుకుంటారా అన్నది చాలా మందిని వేధించే ప్రశ్న. సినిమాలో చూసే ప్రతీ బోల్డ్‌ సీన్‌ని షూటింగ్‌లో అదేవిధంగా చిత్రకరించరని అనుకోకూడదు. ఫైనల్‌ ఎడిటింగ్‌కి రియల్‌ షూట్‌కు తేడా ఉంటుంది. అసలు ఈ ముద్దు సీన్లను ఎలా షూట్‌ చేస్తారో తెలుసుకునేందుకు ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Movie Scenes : హీరోహీరోయిన్‌ నిజంగానే ముద్దు పెట్టుకుంటారా? రొమాంటిక్ సీన్స్‌ని ఎలా షూట్ చేస్తారు?

Movie Scenes : సినిమాలు(Cinemas), వెబ్ సిరీస్‌(Web Series) లలో హీరోహీరోయిన్ల(Hero & Heroines) మధ్య రొమాంటిక్ సీన్స్(Romantic Scenes) ఎక్కువగా చూపిస్తుంటారు. నేటి కథల్లో రొమాన్స్(Romance) కోణాన్ని జోడించడం కామన్ అయిపోయింది. నటులు కొన్నిసార్లు ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం(Kissing), కొన్నిసార్లు బెడ్‌పై రొమాన్స్ చేయడం కనిపిస్తుంది. వెండితెరపై చూపించిన ఈ సన్నివేశాలను ఎలా చిత్రీకరిస్తారో తెలుసా? నిజంగానే వారు రొమాన్స్‌ చేసుకుంటారా?

తెరపై హీరోహీరోయిన్ల మధ్య రొమాన్స్‌ లేదా ముద్దు సన్నివేశాన్ని చూస్తుంటే రియల్‌గా ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటున్నారనిపిస్తుంది. అలాంటి పరిస్థితిలో సెట్ వాతావరణం కూడా సెన్సిటివ్‌గా మారుతుంది. హీరో, హీరోయిన్లు ఒకరికొకరు కంఫర్టబుల్‌గా లేకపోతే సీన్‌షూట్ చేయడంలో మరింత ఇబ్బంది ఉంటుంది. అయితే ముద్దు సన్నివేశాన్ని చిత్రీకరించడానికి మేకర్స్ ఎంత కష్టపడాల్సి వచ్చిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

 do hero heroine in movies really kiss and do romance what is croma

ఎలా షూట్ చేస్తారు?

ముద్దు సన్నివేశాన్ని షూట్ చేయడం చాలా కష్టం. ఇలాంటి సన్నివేశాల కోసం నటీనటులు, నటీమణులను ఒప్పించడమే పెద్ద టాస్క్‌. నిజానికి ఈ సీన్స్‌ని చూపించిన విధంగా షూట్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని ట్రిక్స్‌తో బోల్డ్ సీన్ షూట్ చేస్తారు. బోల్డ్ లేదా రొమాంటిక్ ముద్దు సన్నివేశాన్ని చిత్రీకరించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఈ పద్ధతుల్లో ఒకటి బ్యూటీ షాట్స్. బ్యూటీ షాట్ అనేది ఏదో ఒక వస్తువు, అందం లేదా ఆకర్షణీయ అంశాలను నొక్కి చెప్పే షాట్. ఇందులో సినిమాటోగ్రఫీ(Cinematography) లోని ఓ టెక్నిక్‌తో సీన్‌లో ముద్దు పెట్టుకున్నట్టు ప్రేక్షకులు ఫీలయ్యేలా చేస్తారు.

క్రోమా టెక్నాలజీ:

ఎవరినైనా కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం, చేతులు పట్టుకోవడం వంటివి బ్యూటీ షాట్స్‌(Beauty Shots) లో ఉంటాయి. ఇందులో దర్శకుడు చూపించాలనుకున్న పోర్షన్ క్లోజప్‌ను మాత్రమే చూపించే విధంగా కెమెరా యాంగిల్‌ను ఉంచుతారు. అలాంటి సన్నివేశంలో బెడ్‌పై శాటిన్ బెడ్ షీట్లను ఉపయోగించి దాన్ని కవర్ చేయడం ద్వారా ఓ భ్రమను మాత్రమే సృష్టిస్తారు. క్రోమా టెక్నాలజీ ద్వారా అన్ని సన్నివేశాలను ఒకే రంగు స్క్రీన్ ముందు చిత్రీకరిస్తారు. ఒక రొమాంటిక్ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి, ఈ సన్నివేశాన్ని ఆకుపచ్చ లేదా నీలం లెన్స్‌తో షూట్ చేస్తారు. ఇది తరువాత ఎడిటింగ్ నుంచి ఇది మాయమవుతుంది. ఉదాహరణకు ఒక నటుడికి రొమాంటిక్ సీన్ చేయడం కంఫర్టబుల్‌గా లేకపోతే ఆ సన్నివేశాన్ని వాటి మధ్య ఆకుపచ్చని కర్టెన్‌తో షూట్ చేస్తారు.

 do hero heroine in movies really kiss and do romance what is croma

ఏ రంగుతో పోలిస్తే ఆకుపచ్చ రంగు కాంతిని స్వయంగా గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది బ్యాక్ గ్రౌండ్‌ను ఎడిట్ చేయడం కూడా ఈజీ చేస్తుంది. ఎగ్జాంపుల్‌గా హీరో, హీరోయిన్లు సొరకాయను ముద్దు పెట్టుకుంటున్నారనుకోండి.. అప్పుడు ఆకుపచ్చ రంగు కారణంగా, ఈ కూరగాయ క్రోమాగా పనిచేస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో ఇద్దరు నటుల మధ్య సొరకాయను తొలగించి ఫైనల్ ఎడిటింగ్‌లో హీరో హీరోయిన్ నిజంగానే ముద్దు పెట్టుకున్నట్లు అనిపిస్తుంది. ఇదండీ అసలు మేటర్!

ఇది కూడా చదవండి: మార్నింగ్‌ ఈ అలవాట్లను దినచర్యలో చేర్చండి.. దెబ్బకు బరువు తగ్గుతారు!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.  

Advertisment
Advertisment
తాజా కథనాలు