Telangana: డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు.. అది నిజమేనా?!

తెలంగాణ ఎన్నికల్ల కౌంటింగ్ నేపథ్యంలో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. స్వయంగా కేసీఆరే డీల్ చేస్తున్నారని ఆరోపించారు.

New Update
Telangana: డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు.. అది నిజమేనా?!

DK Shiva Kumar: మరికొన్ని గంటల్లో తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తమ అభ్యర్థులతో సీఎం కేసీఆర్ స్వయంగా మాట్లాడుతున్నారని ఆయన చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ నేరుగా తమ అభ్యర్థులతో మాట్లాడినట్లు చెప్పారు. ఈ విషయాన్ని తమ అభ్యర్థులే తెలిపారన్నారు. అయితే.. తమ అభ్యర్థులు ఎవరూ బయటకు వెళ్లరన్నారు. ఇదిలా ఉంటే.. రేపు ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయ్యింది.

డీకే శివకుమార్ ను ఆ పార్టీ హైకమాండ్ రంగంలోకి దించింది. రేపు రిజల్ట్స్ వచ్చిన వెంటనే అభ్యర్థులను క్యాంప్ కు తరలించాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు సైతం సాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే క్వార్టర్ట్స్ లో ఠాక్రే రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీకి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు హాజరైనట్లు తెలుస్తోంది.

కౌంటింగ్ సమయంలో ఎలా అప్రమత్తంగా ఉండాలి అన్న అంశంపై వీరి భేటీలో చర్చ జరుగుతోంది. మరో వైపు బీఆర్ఎస్ నేతలు సైతం గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఫలితాలు తప్పకుండా తమకు అనుకూలంగానే ఉంటాయని.. టెన్షన్ పడాల్సిన అవసరం లేదని తనను కలిసిన నేతలతో కేసీఆర్ చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేటీఆర్ కూడా ఇదే ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

Also Read:

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తుపాను ఎఫెక్ట్‌.. 142 ట్రైన్స్ రద్దు..

కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, 144 సెక్షన్..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Virat Kohli Record: రాజస్థాన్‌తో మ్యాచ్.. కింగ్ కోహ్లీ ముందు భారీ రికార్డు- 3 సిక్సులు బాదితే

ఇవాళ చినస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ vs ఆర్ఆర్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ముందు భారీ రికార్డు ఉంది. కోహ్లీ మరో మూడు సిక్స్‌లు బాదితే టీ20 క్రికెట్‌లో (ఛాంపియన్స్ లీగ్, ఐపీఎల్‌) 300 సిక్స్‌లు కొట్టిన తొలి ఆర్సీబీ బ్యాటర్‌గా నిలుస్తాడు.

New Update
virat Kohli rcb

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్‌లో భాగంగా ఇవాళ 42వ మ్యాచ్ జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ముందు భారీ రికార్డు ఉంది. రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఓ రికార్డు అందుకునే ఛాన్స్ ఉంది. 

Also read :  పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!

కోహ్లీ ముందు భారీ రికార్డు

కోహ్లీ మరో మూడు సిక్స్‌లు కొడితే ఎవరికీ అందనంత అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నవాడవుతాడు. అవును.. ఈ మ్యాచ్‌లో కోహ్లీ మూడు సిక్స్‌లు బాదితే టీ20 క్రికెట్‌లో (ఛాంపియన్స్ లీగ్, ఐపీఎల్‌) 300 సిక్స్‌లు కొట్టిన తొలి ఆర్సీబీ బ్యాటర్‌గా నిలుస్తాడు. ఈ విషయం తెలిసి కోహ్లీ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. మరి ఈ మ్యాచ్‌లో కోహ్లీ మూడు సిక్సులు కొట్టి రికార్డును క్రియేట్ చేస్తాడా? లేదా? అనేది చూడాలి. 

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

టాస్ గెలిచిన ఆర్ఆర్

ఐపీఎల్ లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు,  రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్  జరుగుతోంది.  ముందుగా టాస్ గెలిచిన జట్టు రాజస్థాన్  కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బెంగళూరు బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్  లో రాజస్థాన్  కీలక ఆటగాడు సంజూ ఆడటం లేదు. కాగా ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య మొత్తం 33 మ్యాచ్ లు జరగగా..  16 సార్లు ఆర్సీబీ గెలువగా..  14 సార్లు రాజస్థాన్ గెలిచింది. 

జట్లు:

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (సి), ధ్రువ్ జురెల్ (w), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, ఫజల్‌హాక్ ఫరూకీ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్(సి), దేవదత్ పడిక్కల్, జితేష్ శర్మ(w), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్

virat-kohli | IPL 2025 | virat-kohli-records | rcb-vs-rr | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment