Anantapuram: చెరువు కట్టపై దివ్య సుగుణాల గణపతి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ప్రసిద్ధ స్థల పురాణం. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని సందర్శించే భక్తుల సందడితో నేత్రపర్వంగా అలరారుతోంది. మహిమగల ఈ వేల్పును భక్తిశ్రద్ధలతో మొక్కిన తలచిన పనులు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఆ ఆలయ విషయాలు ఇప్పుడు చూద్దాం. By Vijaya Nimma 17 Sep 2023 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి భక్తిశ్రద్ధలతో.. అనంతపురం నగరంలోని చెరువు కట్టపై వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ప్రసిద్ధ స్థల పురాణం. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని సందర్శించే భక్తుల సందడితో నేత్రపర్వంగా అలరారుతోంది. మహిమగల ఈ వేల్పును భక్తిశ్రద్ధలతో మొక్కిన తలచిన పనులు నెరవేరుతాయని భక్తు నమ్మకం. పెళ్లి కావలసిన యువతీయువకులకు వివాహ గడియలు సమీపిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఆలయాన్ని సందర్శించి భక్తజన సందోహం నానాటికీ అధికమవుతోంది. అంతే కాకుండా వినాయకుడికి ఎదురుగా నంది విగ్రహం వుండడం చాలా విశేషమని ఈ ఆలయానికి ప్రసిద్ధమైన స్థల పురాణం కూడా ఉందని చాలా మంది భక్తులు చెప్తారు. ఆలయ అభివృద్ధికి కృషి పరమశివునికి వీరభక్తుడైన తటకాసురుడనే రాక్షసుడి ఊచకోతను భరించలేక ప్రజలు పరమశివునికి మొరపెట్టుకున్నారని. భక్తుని అదుపు చేయలేని పరమశివుడు, దేవరకొండ పై వెలసిన శ్రీ వెంకటరమణుడిచ్చిన ఉపాయంతో వినాయక రూపం ధరించి వృషభరూరుడై రాక్షసున్ని వదించాడని అనంతరం స్వామి వరసిద్ధి వినాయకుడిగా ఇక్కడే కొలువుదీరి.. భక్తుల కొంగుబంగారమయ్యాడు. శతాబ్దాల చరిత కలిగిన దేవాలయం శిథిలావస్థకు చేరుకోగా 1960 సంవత్సరంలో తమిళనాడుకు చెందిన ఓ సాధువు పునరుధ్ఘటించారు. ఆయన కృషి ఫలితంగా శిథిలం కాకుండా నిలబడింది. దీంతోపాటు ఆయన కొంతమేరకు ఆలయ అభివృద్ధికి కృషి చేశారు. ఆనాటి నుంచి భక్తజనులతో ఆలయం కిటకిటలాడుతోంది. గరికతో చేసే పూజా ప్రత్యేకం అనంతపురం జిల్లా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతారు. చేపట్టిన పనుల్లో ఎలాంటి అడ్డంకులు ఎదురవకుండా వినాయకుడికి పూజలు నిర్వహించడం పరిపాటి. కాగా ఆలయ ప్రాంగణంలో వ్రతమాచరించి, స్వామి వారికి ఇష్టమైన కుడుములు నివేదించిన వివాహితులకు శీఘ్రమే వివాహం జరుగుతుందన్నది ఈ ఆలయ ప్రత్యేకత. అంతేకాదు, కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలు ఏవైనా కానీ యజమానులు ఇక్కడ పూజలు చేయించు కోవడం. ఆ విధంగా చేయడం వలన ఎలాంటి ఇబ్బందులు ఎదురవు కావని వారి నమ్మకం. ప్రతి మంగళవారం గరికతో నిర్వహించే పూజా కార్యక్రమాలు చాలా విశేషమైనవి. #anantapuram #shree-varasiddhi-vinayaka-swamy-temple #ceruvu-katta మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి