పాత స్థలం కోసం రెవెన్యూ-పోలీస్ శాఖల మధ్య వివాదం నరసాపురంలో రెవెన్యూ, పోలీస్ శాఖల మధ్య స్థల వివాదం నెలకొంది. రెవెన్యూ డివిజనల్ కార్యాలయం ఉత్తరం వైపున ప్రధాన రహదారికి ఆనుకుని గతంలో పట్టణ పోలీస్ స్టేషన్, సీఐ కార్యాలయం ఉండేవి. అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. రెండేళ్ల కిందట ఈ సేవా కేంద్రంలో టౌన్ పోలీస్ స్టేషన్, సీఐ కార్యాలయాలను తరలించారు. ఏడాది కిందట ఈ కార్యాలయ శిథిల భవనాలను తొలగించారు. By Vijaya Nimma 22 Jul 2023 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి పశ్చిమ గోదావరి నరసాపురంలో ముదిరిన పోలీస్ రెవెన్యూ శాఖల మధ్య గతంలో మునిసిపల్, ఫైర్స్టేషన్ల మధ్య స్థల వివాదం నెలకొంది. ఇంకా ఇది ఓ కొలిక్కిరాలేదు. వివాదం సాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నిన్న (జూలై 21) రెవెన్యూ పోలీస్‌ల మధ్య కొత్తగా స్థల వివాదం చోటు చేసుకుంది. గతంలో మొగల్తూరు రోడ్‌కు అనుకుని టౌన్ పోలీస్‌స్టేషన్, దాని వెనుక సీఐ కార్యాలయం ఉండేది. శిథిలావస్థకు చేరడంతో రెండేళ్ళ క్రితం వీటిని స్టీమర్రోడ్లోకి మార్చారు. పాత కార్యాలయాలు రెండు కూల్చివేశారు. రెవెన్యూ సిబ్బంది అభ్యంతరం రూరల్ సీఐ కార్యాలయం గతంలో అన్నక్యాంటీన్ కోసం నిర్మించిన భవనంలో కొనసాగుతుంటే.. టౌన్ స్టేషన్ మీసేవ కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఇటీవల సబ్‌కలెక్టర్ కార్యాలయం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా గతంలో పోలీస్‌స్టేషన్, ఆఫీసర్స్‌క్లబ్ ఉన్న ప్రదేశాలన్నింటిని సబ్ కలెక్టర్ ప్రాంగణంలోనే ఉండే విధంగా గోడ నిర్మాణం చేపట్టారు. ఇదిలా ఉంటే జూలై 21 సాయంత్రం కొత్తగా నిర్మించిన గోడ వద్దకు ఎక్స్కవేటర్ వెళ్లింది.ఈ విషయం గుర్తించిన రెవెన్యూ సిబ్బంది అభ్యంతరం తెలిపారు. ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఈ ప్రాంగణ మంతా రెవెన్యూదని రికార్డులు చూపించారు. దీంతో పోలీసులు కూడా గతంలో ఈ స్థలం కేటాయిస్తూ జారీ అయిన కాగితాలను చూపించారు. ఈ విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ సూర్యతేజ కార్యాలయానికి చేరుకున్నారు. డీఎస్పీ మనోహరాచారి, సీఐలు సురేష్‌బాబు, శ్రీనివాసులతో దాదాపు 2 గంటల పాటు ఈ వివాదంపై చర్చలు జరిగాయి. తహసీల్దార్ ఫాజిల్ కూడా చర్చల్లో ఉన్నారు. బ్రిటిష్ కాలం నాటి రికార్డులను పోలీసులకు చూపించారు. ఈ స్థలం తమదేనని అందుకే గోడ నిర్మాణం చేపట్టామని తహ సీల్దార్ వివరించారు. ఇటు పోలీసులు తమకు కేటాయిస్తూ ఉన్న పత్రాలను సబ్‌కలెక్టర్‌కు అందించారు. చివరికి ఈ విషయాన్ని జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నేతలు, ఉన్నతాధికారులు ఈ స్థలంపై ఏ విధంగా స్పందిస్తారన్నది వేచి చూడాల్సి ఉంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి