దేశంలో ఎక్కువ మంది ఆహారం వల్లే అనారోగ్యానికి గురవుతున్నారు.. ఐసీఎంఆర్

మనదేశంలో వస్తున్న వ్యాధుల్లో 56 శాతం కేవలం అనారోగ్యకర ఆహారం తీసుకోవడం వల్లనే వస్తున్నాయి. అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) చెప్తోంది.  ఈ సందర్భంగా హెల్దీగా ఉండేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో కూడా సూచించింది.అవేంటంటే..

New Update
దేశంలో ఎక్కువ మంది ఆహారం వల్లే  అనారోగ్యానికి గురవుతున్నారు.. ఐసీఎంఆర్

వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, జన్యుపరమైన వ్యాధులను పక్కనపెడితే ఒబెసిటీ, డయాబెటిస్, బీపీ, ఇతర అవయవాలకు సంబంధించిన పలు సమస్యలన్నీ సరైన ఆహారం తీసుకోకపోవడం వల్లనే అని ఐసీఎంఆర్ అంటోంది. వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తగిన ఆహారాన్ని ఎలా తీసుకోవాలో కొన్ని టిప్స్ చెప్పింది.

దేశంలో ఎక్కువమందిని బాధపెడుతున్న సమస్యల్లో డయాబెటిస్, బీపీ, ఒబెసిటీ ముందున్నాయి. వీటిని తగ్గించుకోవడం కోసం సరైన డైట్ పాటిస్తూ శారీరక వ్యాయామాలు చేయాలని ఐసీఎంఆర్ కోరుతోంది. ఆహారంలో తీసుకునే ఉప్పు శాతాన్ని తగ్గించడం ద్వారా మరింత ఆరోగ్యంగా ఉండొచ్చని.. అలాగే నూనె పదార్థాలు, ఇతర ఫ్యాట్స్‌ను కూడా మితంగా తీసుకోవాలని సూచిస్తోంది. ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగర్ వంటి వాటిని కూడా గణనీయంగా తగ్గించాలని ఐసీఎంఆర్ కోరుతోంది. ఒబెసిటీ, బీపీలకు ఇవే ముఖ్యకారణంగా ఉంటున్నాయని చెప్తోంది.

హెల్దీగా ఉండేందుకు ప్యాక్డ్ ఫుడ్స్‌ను తగ్గించాలని, వాటిని కొనేటప్పుడు ప్యాకెట్లపై ఉన్న లేబుళ్లను నిశితంగా పరిశీలించాలని సూచిస్తోంది. రెడీ టు కుక్ ఫుడ్స్, ప్రొటీన్ సప్లిమెంట్ల వంటివి కూడా పలురకాల సమస్యలకు కారణమవుతున్నాయి. వాటిని కూడా తగ్గించాలని కోరింది. రోజువారీ ఆహారంలో షుగర్ 5 శాతం, మిల్లెట్స్, ఇతర ధాన్యాలు 45 శాతం, ప్రొటీన్స్ 15 శాతం ఉండేలా చూసుకోవాలంటోంది. ప్రొటీన్ ఇన్‌టేక్ విషయంలో వ్యక్తి బరువుని బట్టి కేజీకి 1.6 గ్రాముల ప్రొటీన్ తీసుకోవాలని.. అంతకుమించి ప్రొటీన్ తీసుకోరాదని సూచించింది. వీటితోపాటు తాజా ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు డైట్‌లో తప్పక ఉండేలా చూసుకోవాలని కూడా ఐసీఎంఆర్ తన లిస్ట్‌లో పేర్కొంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు