Janasena: పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్.. పిఠాపురం నియోజవర్గంలో బయటపడ్డ విభేదాలు..! పిఠాపురం నియోజవర్గంలో నాగబాబు సాక్షిగా వర్గ విభేదాలు బయటపడ్డాయి. జనసేన నాయకులు నడిరోడ్డుపై వాగ్వాదానికి దిగారు. కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన ఒంటెద్దు పోకడలు మార్చుకోకపోతే పిఠాపురంలో జనసేన పతనం తప్పదని ఫైర్ అయ్యారు. By Jyoshna Sappogula 14 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి Pithapuram Jansena: పిఠాపురం నియోజవర్గంలో నాగబాబు సాక్షిగా విభేదాలు బయటపడ్డాయి. నాగబాబు పర్యటన సందర్భంగా కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి టీ-టైమ్ తంగెళ్ల శ్రీనివాస్ పిఠాపురానికి వచ్చారు. అయితే, తంగెళ్ల శ్రీనివాస్ రాకతో వర్గ విభేదాలు బయటపడ్డాయి. Also Read: సీఎం జగన్ పై దాడి జరిగిందో లేక జరిపించుకున్నారో: కేఏ పాల్ జనసేన నాయకులు పిఠాపురం నడిరోడ్డుపై వాగ్వాదానికి దిగారు. ఎంపీ అభ్యర్థి తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ముందుగా నుండి తమకు ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదంటూ జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ ఇదే విధంగా వ్యవహరిస్తే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఓటమి తప్పదని హెచ్చరించారు. తాము సొంత డబ్బులు ఖర్చు చేసుకుని పార్టీ కోసం కష్టపడుతున్న తమను పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. Also Read: ఆ ప్రతీకారంలో భాగంగానే సల్మాన్ హత్యకు కుట్ర.. తీహార్ జైలు నుంచి సుపారీ! తంగెళ్ళ ఒంటెద్దు పోకడలు మార్చుకోకపోతే పిఠాపురంలో జనసేన పతనం తప్పదు జనసైనికులు వాపోతున్నారు. ఎన్నికల నిర్వహణ కమిటీ ఏర్పాటుతో జనసేన నేతల్లో అంతర్గత తగాదాలు బయటపడ్డాయి. పది సంవత్సరాలుగా జనసేనలో కష్టపడుతున్న వారికి చోటు లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల ఎన్నికల ప్రచారాలకు నాయకులు దూరమవుతున్నారన్నారు ఆ పార్టీ నేత చెల్లుబోయిన సతీష్. అయినా, సరే పవన్ కళ్యాణ్ కోసం కష్టపడతామంటున్నారు. #pawan-kalyan #ap-elections-2024 #pithapuram #janasena మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి