Shankar : 'ఇండియన్' మూవీని మూడు పార్ట్ లుగా తీయడానికి కారణం అదే : శంకర్

శంకర్ - కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఇండియన్ 2′. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో డైరెక్టర్ శంకర్ ‘పార్ట్-3' గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్ళండి.

New Update
Shankar : 'ఇండియన్' మూవీని మూడు పార్ట్ లుగా తీయడానికి కారణం అదే : శంకర్

Director Shankar About Indain Part-3 : కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇండియన్ 2′. 90’s లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో భారతీయుడు) మూవీకి ఇది సీక్వెల్ గా తెరకెక్కుతుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ సినిమాపై అమాంతం పెంచేసాయి. కాగా ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో డైరెక్టర్ శంకర్ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

మూడు భాగాలుగా...

ఇండియన్ మూవీని మూడు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు. ఇండియన్ 2 జూలై 12 న రిలీజ్ అవుతుండగా.. దీనికి కొనసాగింపుగా పార్ట్-3 కూడా ఉండబోతుంది. దీనికి సంబంధించి షూటింగ్ కూడా కంప్లీట్ అయిందట. వచ్చే ఏడాది పార్ట్-3 ని రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఇదే విషయం గురించి డైరెక్టర్ శంకర్ మాట్లాడారు.

Also Read : జక్కన్న దంపతులకు ఆస్కార్ అకాడమీ నుంచి అరుదైన ఆహ్వానం!

అందుకే మూడు పార్ట్ లు...

"భారతీయుడు’ మొదటి భాగం ఒక స్టేట్‌లో జరిగే కథ. 3.20 గంటల నిడివి. ఆ చిత్రం బ్లాక్‌బస్టర్‌ అయింది. ఇప్పుడు ‘భారతీయుడు 2’ దేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కథ. సినిమా ప్రారంభించినప్పుడు ఒక్క పార్ట్‌లోనే మొత్తం చూపించాలని భావించాం. కానీ, చిత్రీకరణ మొదలుపెట్టాక అన్ని సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి. ఒక్క పార్ట్‌లోనే దీన్ని చూపించాలంటే కొన్ని సన్నివేశాలు కట్‌ చేయాలి. లేదంటే నిడివి తగ్గించాలి. అలా చేస్తే వాటిలో ఉన్న పవర్‌ పోతుంది. అన్ని సీన్స్ బాగా వచ్చాయి. ఎక్కడా బోర్‌ కొట్టడం లేదనిపించింది. అందుకే దీన్ని మరో పార్ట్‌ (భారతీయుడు 3) చేయాలని నిర్ణయించుకున్నాం" అని తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు