RGV : అలాంటి సినిమాలు చాలా డేంజర్.. వాటి జోలికి వెళ్లకపోవడమే మంచింది : రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో పురాణాల ఆధారంగా సినిమాలు తీయడం ప్రమాదకరమని, ఇది మన దేశంలో సాధ్యం కాదని అన్నారు. సోషల్ మీడియా కారణంగా విభేదాలు, విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ తరహా జానర్‌పై సినిమాలు తీయడం చాలా డేంజర్ అని అన్నారు. By Anil Kumar 03 Aug 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Director Ram Gopal Varma : రణ్ బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా బాలీవుడ్ లో ‘రామాయణం’ సినిమా తెరకెక్కుతున్న నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. పురాణాల ఆధారంగా సినిమాలు తీయడం ప్రమాదకరమని, ఇది మన దేశంలో సాధ్యం కాదని అన్నారు."పురాణాలపై సినిమాలు తీయడం రెండు రకాలుగా ప్రమాదకరం. ఒకటి, ప్రజలకు తెలిసిన కథలను వేరే విధంగా చూపిస్తే ప్రతికూల ప్రభావం పడుతుంది. రెండోది, పూర్వం బాబుభాయ్ మిస్త్రీ, ఎన్టీ రామారావుల కాలంలో వీటికి మంచి ఆదరణ ఉండేది. కానీ, ఇప్పుడు ప్రజలు వీటిని భక్తితో చూస్తారు. దాన్ని మీరు మరోలా చూపిస్తే అది బెడిసికొడుతుంది. పైగా పురాణాల్లో పేర్కొన్న వ్యక్తులను మన దేశంలో దేవుళ్లుగా పూజిస్తారు. కాబట్టి ఇక్కడ అలాంటి సాహసాలు చేయలేము. సోషల్ మీడియా కారణంగా విభేదాలు, విమర్శలు ఎక్కువయ్యాయి. Also Read : ఏంటి.. ‘బాహుబలి’ లో భల్లాల దేవ పాత్ర కోసం మొదట ఆ హాలీవుడ్ హీరోను అనుకున్నారా? ఆదిపురుష్‌ను తీసుకోండి. అందులో లంకేశ్‌గా సైఫ్ అలీ ఖాన్ లుక్, హనుమాన్ లుక్ మీద ఎంత రచ్చ జరిగిందో.. ఇలా పదేపదే విమర్శలు వెల్లువెత్తినప్పుడు ఈ తరహా జానర్‌పై సినిమాలు తీయడం చాలా డేంజర్. నేనేమంటానంటే.. కొత్త కథను తీసుకుని దానికి రామయణ అనే పేరు పెట్టకుండా తీయండి. ఇప్పుడు ఆదిపురుష్.. ప్రభాస్ సినిమా అంటే జనాలు ఒకలా ఆలోచిస్తారు. అది రామాయణం అంటే జనాల ఆలోచన మరోలా ఉంటుంది. ఇలాంటి సున్నిత అంశాల జోలికి వెళ్లడం అవసరమా? ఏదేమైనా ధైర్యం చేసి మరీ ఇలాంటి మూవీస్ తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్నవారికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను" అంటూ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. #ram-gopal-varma మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి