Nag Ashwin : 'కల్కి' కథ రాయడానికి అన్నేళ్లు పట్టిందా? షాకింగ్ విషయాలు రివీల్ చేసిన నాగ్ అశ్విన్! డైరెక్టర్ నాగ్ అశ్విన్ ' 'వరల్డ్ ఆఫ్ కల్కి' పేరుతో 'కల్కి' గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. కలియుగం తర్వాత ఏం జరుగుతుంది అనేది కథగా రాయలనుకున్నా. ఈ కథ రాయడానికి 5 సంవత్సరాలు పట్టిందని సినిమా గురించి మరెన్నో విశేషాలు తెలిపాడు. By Anil Kumar 19 Jun 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Director Nag Ashwin about Kalki Story : టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ ఫిలిం 'కల్కి 2898AD'. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత అశ్వినీదత్ (Aswani Dutt) భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా జూన్ 27 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక మూవీ ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'వరల్డ్ ఆఫ్ కల్కి' (World Of Kalki) పేరుతో తాజాగా ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ చేశారు. ఇందులో కల్కి కథ ఎలా ఉండబోతోందో వివరించాడు. ఐదేళ్లు పట్టింది... ‘కలియుగంలో ఏం జరుగుతుంది. ఏం జరిగే అవకాశం ఉంది.. ఇలాంటి వాటన్నిటికీ ‘కల్కి’ క్లైమాక్స్. కేవలం భారతదేశంలోని ప్రేక్షకులేకాదు.. ప్రపంచంలో వారంతా దీనికి కనెక్ట్ అవుతారు. నాకు చిన్నప్పటి నుంచి పౌరాణిక చిత్రాలంటే ఆసక్తి ఎక్కువ. ‘పాతాళభైరవి’ నాకు ఇష్టమైన సినిమా. అలాగే ‘భైరవ ద్వీపం’, ‘ఆదిత్య 369’, హాలీవుడ్ ‘స్టార్ వరల్డ్’ ఆకట్టుకున్నాయి. మహాభారతంలో ఎన్నో గొప్ప పాత్రలున్నాయి. కృష్ణవతారంతో అది ముగుస్తుంది. Also Read : టాలీవుడ్ ‘మిత్రవింద’ కాజల్ అగర్వాల్ గురించి ఈ విషయాలు తెలుసా? అక్కడి నుంచి కలియుగం ప్రారంభమవుతుంది. దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది కథగా రాయలనుకున్నా. ప్రతి యుగంలో కలిపురుషుడిలా ప్రవర్తించేవారు ఉన్నారు. ఒక యుగంలో రావణుడు, మరోయుగంలో దుర్యోధనుడు.. ఇక కలియుగంలో ఎలా ఉంటాడు అనేది చూపించాలనుకున్నా. అతడితో పోరాటం చేయడం చూపించాం. ఈ కథ రాయడానికి 5 సంవత్సరాలు పట్టింది. సైన్స్‌కు మైథాలజీని జోడించి తీశాం. ప్రేక్షకుల స్పందన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా #kalki-2898-ad #nag-aswin #world-of-kalki మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి