Raghavendra Rao : చంద్రబాబుతో కలిసి అడుగులు వేసేందుకు సిద్ధం..రాఘవేంద్రరావు సంచలన వ్యాఖ్యలు.!

చంద్రబాబుతో కలిసి అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నామని టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొన్ని కోట్ల మంది ప్రజల గుడ్ విషెస్, ప్రేయర్స్ తో చంద్రబాబు బయటకు రావడం సంతోషంగా ఉందని అన్నారు.

New Update
Raghavendra Rao : చంద్రబాబుతో కలిసి అడుగులు వేసేందుకు సిద్ధం..రాఘవేంద్రరావు సంచలన వ్యాఖ్యలు.!

K. Raghavendra Rao: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) రాజమండ్రి జైలు నుంచి బెయిల్ పై విడుదల కావడంతో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సంతోషం వ్యక్తం చేశారు. కొన్ని కోట్ల మంది ప్రజల గుడ్ విషెస్, ప్రేయర్స్ తో చంద్రబాబు బయటకు రావడం సంతోషంగా ఉందని అన్నారు. మీకు భగవంతుడు మంచి ఆరోగ్యం, ఆయుష్షును ఇవ్వాలని కోరుకుంటున్నానని చెప్పారు. కొత్త ఉత్సాహంతో మీతో కలిసి అడుగులు వేసేందుకు సిద్ధంగా ఉన్నామని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు.

K. Raghavendra Rao

Also Read: ఇష్టానుసారం మాట్లాడుతున్నావే చెల్లెమ్మా..పురందేశ్వరిపై షాకింగ్ కామెంట్స్.!

స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడంపై పలుసార్లు స్పందించారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. రెండు రోజుల క్రితం కూడా సోషల్ మీడియాలో ఎమోషనల్ ట్వీట్ చేశారు. హైదరాబాద్ మహా నగరాన్ని నిర్మించిన చంద్రబాబు కి లక్షలాదిమంది మద్దతిస్తున్నారంటూ ట్వీట్ చేశారు. ‘ఈ విశ్వనగరాన్ని నిర్మించిన మీ కోసం లక్షలాది మంది తరలి రావడాన్ని చూస్తుంటే చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నాను. మీతో ప్రయాణం ఎంతో గర్వంగా ఉంది. అందుకు మీకు నేను కృతజ్ఞుడిని. మీరు ఆరోగ్యంతో, నూతన శక్తి తో త్వరగా బయటకు రావాలని ఆ ఏడుకొండల వాడిని ప్రార్ధిస్తున్నాను’ అని తన ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే తన ట్వీట్ లో చంద్రబాబు పేరు రాఘవేంద్రరావు ప్రస్తావించలేదు.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుని పోలీసులు సెప్టెంబర్ 9న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన అరెస్టుని ఖండించారు టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు ముఖ్య వ్యక్తులు. అందులో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఒకరు. వీరితో పాటు హైదరాబాద్ లో పనిచేసే ఐటీ ఉద్యోగులు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు తెలంగాణలోనూ ఆయన అరెస్టు కి వ్యతిరేకంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం ఆయన బెయిల్ పై రిలీజ్ అయ్యారు.  కాగా, ఈ పరిణామాలతో తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పోటీకి దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు