Harish Shankar : 'ఉస్తాద్ భగత్ సింగ్' టైటిల్ మార్పు వెనక అసలు కారణం అదే : హరీష్ శంకర్ డైరెక్టర్ హరీశ్ శంకర్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ టైటిల్ మార్పుకు గల కారణాన్ని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. 'భవదీయుడు భగత్‌సింగ్' టైటిల్ ప్రకటించిన తర్వాత చాలామందికి అది కనెక్ట్ కాలేదు. స్క్రిప్ట్ కూడా కాస్త మారింది. దానికి తగ్గట్లుగానే టైటిల్ మార్చామని అన్నారు. By Anil Kumar 23 Aug 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Director Harish Shankar : కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. పవన్ ఇటీవల పాలిటిక్స్ తో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ చిత్ర షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది. త్వరలోనే చిత్రీకరణ పునఃప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే తొలుత ఈ సినిమాకి ‘భవదీయుడు భగత్‌సింగ్’ అనే టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పేరును కాస్త ‘ఉస్తాద్ భగత్‌సింగ్’గా మార్చారు. డైరెక్టర్ హరీశ్ శంకర్ ఈ సినిమా పేరు మార్చడానికి గల కారణాన్ని తాజాగా వెల్లడించారు. Also Read : ‘రాయన్’ సక్సెస్.. ధనుష్ కు నిర్మాత సర్ప్రైజ్ " 'భవదీయుడు భగత్‌సింగ్' అని టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు చాలామందికి అది సరిగ్గా అర్థం కాలేదు. భగత్ సింగ్ అంటే ఒక విస్ఫోటనం. భవదీయుడులో ఒక వినయం, భగత్‌సింగ్‌లో ఒక విస్ఫోటనం ఉంది. టైటిల్ చాలా బాగుంది ఫిక్స్ చేసేయ్ అని టైటిల్ విన్న వెంటనే పవన్‌కల్యాణ్ చెప్పారు. ఆ టైటిల్ ప్రకటించిన తర్వాత చాలామందికి అది కనెక్ట్ కాలేదు. స్క్రిప్ట్ కూడా కాస్త మారింది. హీరో క్యారెక్టరైజేషన్ మాత్రం అలాగే ఉంటుంది. ఆ భగత్ సింగ్ దేశం కోసం ప్రాణం ఇచ్చాడు. అవసరమైతే ఈ భగత్ సింగ్ దేశం కోసం ప్రాణం తీస్తాడు. ఈ రోజుల్లో అలాంటి భగత్‌సింగ్ కాకుండా ఇలా ఉండాలనే సందేశంతో ఆ టైటిల్ పెట్టాం" అని చెప్పుకొచ్చారు. #ustaad-bhagat-singh #director-harish-shankar సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి