Harish Shankar : 'మిస్టర్ బచ్చన్' రివ్యూస్ పై రియాక్ట్ అయిన హరీష్ శంకర్.. ఇదేం కొత్త కాదంటూ

'మిస్టర్ బచ్చన్' సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో హరీష్ శంకర్ కు మిక్స్‌డ్‌ రివ్యూలపై ప్రశ్న ఎదురైంది.'మిశ్రమ స్పందనలు చాలా సినిమాలకు వచ్చాయి. ‘మిస్టర్‌ బచ్చన్‌’ విషయంలో కొత్తేమీ కాదు' అంటూ హరీష్ తనదైన శైలిలో బదులిచ్చారు.

New Update
Harish Shankar : 'మిస్టర్ బచ్చన్' రివ్యూస్ పై రియాక్ట్ అయిన హరీష్ శంకర్.. ఇదేం కొత్త కాదంటూ

Director Harish Shankar : రవితేజ (Ravi Teja) - హరీష్ శంకర్ (Harish Shankar) కాంబోలో తెరకెక్కిన 'మిస్టర్ బచ్చన్' (Mister Bachchan) మూవీ నేడు (ఆగస్టు 15) న థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ సినిమాకు మొదటి ఆట నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో సోషల్ మీడియాలో డైరెక్టర్ హరీష్ శంకర్ పై పలు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు హరిష్ శంకర్ తన స్పందన తెలిపారు.

ఆ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మిక్స్‌డ్‌ రివ్యూలపై ఎదురైన ప్రశ్నకు హరీష్ శంకర్ స్పందిస్తూ.." సినిమా విడుదలైనప్పుడు అన్ని రకాల స్పందనలు వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరి అభిప్రాయం విలువైనదే. మిశ్రమ స్పందనలు చాలా సినిమాలకు వచ్చాయి. ‘మిస్టర్‌ బచ్చన్‌’ విషయంలో కొత్తేమీ కాదు. నాకు నచ్చినట్టు రివ్యూలు ఇవ్వాలని ఎప్పుడూ చెప్పలేదు. ప్రతి షోకు పాజిటివ్‌ టాక్‌ పెరుగుతోంది.

Also Read : పవన్ కళ్యాణ్ పై భారీ ట్రోలింగ్.. ఉరికి, ఆత్మహత్యకి తేడా తెలీదంటూ నెటిజన్ల మండిపాటు

మాస్‌ సినిమా కాబట్టి ఏ సెంటర్లతో పోలిస్తే బీ, సీ సెంటర్లలో రెస్పాన్స్‌ బాగుంది. కథ డిమాండ్‌ మేరకే సిద్ధు జొన్నలగడ్డను అతిథి పాత్రకు ఎంపిక చేశాం. అతడి ఎంట్రీతో సినిమా మరో స్థాయికి వెళ్లందని చాలామంది అంటున్నారు. స్క్రిప్టులోని ఓ భారీ డైలాగ్‌ను అప్పటికప్పుడు తానే చెప్పేశాడు. ఈ సందర్భంగా సిద్ధుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా" అని అన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఉగ్రదాడి ఎఫెక్ట్.. పాక్ హీరోతో మూవీ.. హీరోయిన్‌పై మండిపడుతున్న నెటిజన్లు

పాక్ హీరో ఫవాద్ ఖాన్, వాణి కపూర్ నటించిన సినిమా ‘అబీర్ గులాల్’ త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాను బహిష్కరించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మూవీ ప్రమోషన్స్ కోసం హీరో, హీరోయిన్ పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు వారిపై మండిపడతున్నారు.

New Update

జమ్మూకశ్మీర్‌ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే ఈ ఘటనపై ఇండియా కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థాన్‌తో సంబంధాలు అన్నింటిని కూడా తెంచుకుంటుంది. ఆఖరికి పాకిస్థాన్ నటీనటులను  కూడా బ్యాన్ చేస్తున్నారు. ఆ దేశానికి చెందిన ఎవరూ కూడా ఇండియాకి చెందిన సినిమాల్లో నటించకూడదని అంటున్నారు.

ఇది కూడా చూడండి: TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

ఇది కూడా చూడండి: Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా..

పాకిస్థాన్ హీరో ఫవాద్ ఖాన్, వాణి కపూర్ ఇద్దరూ కలిసి నటించిన సినిమా ‘అబీర్ గులాల్’. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. దీంతో ఈ సినిమాను బహిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా సినిమాను విడుదల చేసేది లేదని డిమాండ్ చేస్తున్నారు. అయితే మూవీ ప్రమోషన్స్ కోసం హీరోయిన్ ఓ పోస్ట్ కూడా చేసింది. దీంతో నెటిజన్లు మండిపడగా.. వెంటనే డిలీట్ కూడా చేసింది. 

ఇది కూడా చూడండి: Sunstroke: వడదెబ్బకు ఏడుగురు మృతి.. మరో రెండ్రోజులు వడగాల్పులు

Advertisment
Advertisment
Advertisment