Helth Benefits: ఉల్లిపాయే కాదు..దాని పొట్టు కూడా మేలు చేస్తుంది..ఎలాగో తెలుసా..?

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదన్న సామెత గురించి తెలిసిందే. చాలామంది ఉల్లిని తినాటానికి ఇష్ట పడరు. కానీ ఉల్లి లేకపోతే కూర ఉండదు. అది లేకపోతే కూరకు అంత టేస్ట్‌ కూడా రాదు. ఇక ఉల్లి పొట్టులో చాలా పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఉల్లి పొట్టు చేసే మేలు ఎవరు చేయలేరంటున్నారు ఆరోగ్య నిపుణులు.

New Update
Helth Benefits: ఉల్లిపాయే కాదు..దాని పొట్టు కూడా మేలు చేస్తుంది..ఎలాగో తెలుసా..?

చాలామంది ఉల్లిపాయలను కూరలో వేసేటప్పుడు దాని పొట్టును తీసి పడేస్తూ ఉంటారు. అయితే ఉల్లి పొట్టుతో కూడా మనం కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు డాక్టర్లు. ఈ ప్రయోజనాలు తెలియక చాలామంది వాటిని పడేస్తూ ఉంటారు. ఉల్లిపాయ పొట్టులో ఉండే పోషకాలు చర్మం, జుట్టుకు ఇవి ఎక్కువగా మేలు చేస్తాయి. అంతేకాకుండా కంటి చూపుతో ఇబ్బంది పడే వారికి ఈ ఉల్లిపొట్టు కంటి చూపును మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతుంది.

ఆరోగ్యకరమైన కప్పు టీ

అయితే కూర చేసేటప్పుడు ఉల్లిపాయ పొట్టును నీటిలో 20 నిమిషాలు ఉడకబెట్టి పొట్టును వడ కట్టి ఆరోగ్యకరమైన కప్పు టీని తయారుచేసుకుని రోజు తాగవచ్చు. ఈ టీ తాగితే చర్మం ఆరోగ్యంగా ఉంటూ అధిక రక్తపోటు, ఊబకాయం, ఇన్‌ఫెక్షన్లను రాకుండా కాపాడుతుంది. కరోనా తరువాత చాలా మంది రోగనిరోధక శక్తిపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. రోగనిరోధక శక్తి పెరుగుదలకు ఉల్లిపొట్టు నీరు బాగా ఉపయోగపడుతుంది. ఉల్లిపొట్టుల్లో యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల దద్దుర్లు, చర్మం, అథ్లెట్స్ ఫుట్‌పై దురదను చాలా బాగా తగ్గిస్తుంది. చర్మంపై ఉల్లిపాయ పొట్టు నీటిని అప్లై చేయడం ద్వారా ఉపశమనం ఉంటుంది.

నరాలు ప్రశాంతతను పొందుతాయి

ఉల్లిపాయపొట్టుతో తెల్లజుట్టు రంగు కూడా బంగారు గోధుమ రంగులోకి మార్చుకోవచ్చు. అలాగే జుట్టు పెరుగుదలను కూడా ఉల్లిపాయపొట్టు ప్రోత్సహిస్తుంది. ఉల్లిపాయ పొట్టు నల్లగా అయ్యేవరకు మీడియం మంట మీద వేడి చేసి పొట్టును మెత్తగా పేస్ట్‌ చేసుకోవాలి. కొద్దిగా కలబంద జెల్ లేదా నూనె కలిపి జుట్టుకు రాసుకుంటే మంచి ఫలితం వస్తుంది. కంపోస్ట్ చేయడానికి ఉల్లిపాయపొట్టు బాగా సాహయపడుతుంది. వీటిలోని ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం వల్ల అద్భుతమైన కంపోస్ట్‌ తయారు అవుతుంది. ఉల్లిపొట్టును వేయించడం ద్వారా వంటల రుచి, రంగును మారుతుంది. నరాల ఇబ్బందులు ఉన్నవల్లు ఉల్లిపాయపొట్టు టీ తాగడం వల్ల నరాలు ప్రశాంతతను పొందుతాయి. అంతేకాదు రాత్రి సమయంలో నిద్ర బాగా పొతారు.స్త్రీలు పొడిజుట్టు కోసం ఈ పొట్టును హెయిర్ టోనర్‌గా వాడుకోవచ్చు. ఉల్లిపాయ తొక్కలను నీటిలో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మరిగించడం ద్వారా ఈ టోనర్‌ను తయారు చేసుకోవచ్చు. ఇంకే ఉల్లిపాయపొట్టు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూశారుగా.. ఇప్పటి నుంచి అయినా ఉల్లిపాయ పొట్టును పడేయకుండా జాగ్రత్తగా వాడుకోండి.

ఇది కూడా చదవండి: చలికాలంలో వేడి నీళ్లతో తల స్నానం చేయకూడదా..?

Advertisment
Advertisment
తాజా కథనాలు