ధోని చాలా నిస్వార్థ పరుడు..ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్!
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ ప్రశంసలు కురిపించాడు. ధోనీ చాలా నిస్వార్థ క్రికెటర్ అని, అతను కావాలంటే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు కెప్టెన్సీ చేయగలడని హేడెన్ అన్నాడు.
2007 టీ20 వరల్డ్ కప్, 2011 వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ఐసీసీ ట్రోఫీలను భారత జట్టుకు కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ గెలుచుకున్నాడు. అతని రిటైర్మెంట్ తర్వాత భారత్ ఒక్క ఐసిసి ట్రోఫీని కూడా గెలుచుకోలేదు. భారత జట్టులో రన్ మెషీన్లుగా ఉన్న విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఉన్నప్పటికీ ఐసీసీ ట్రోఫీ మాత్రం భారత జట్టు చేతికి రాలేదు.
ఈ సందర్భంలో, 2008 నుండి 2010 వరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడిన ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్ ధోని పాత్ర గురించి మాట్లాడాడు. ధోనీ చాలా నిస్వార్థ క్రికెటర్ అని, కావాలంటే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఉండగలడని చెప్పాడు.“ధోనీ చాలా వినయంగా ఉంటాడు, అతను ఆస్ట్రేలియన్ డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చుని కెప్టెన్‌గా ఉండగలడు ఎందుకంటే అతను అందరికంటే పెద్దవాడు కాదని అతను నమ్ముతాడు. తాను ఎంత గొప్పవాడినో, ఏం సాధించానో అభిమానులతో ఎప్పుడూ మాట్లాడడు. అదే ధోని. అతను అహం లేని వ్యక్తి” అని మాథ్యూ హేడెన్ అన్నారు.
ఏడురోజుల పాటు జపాన్‌లో పర్యటించిన సీఎం రేవంత్ బృందం కీలక ఒప్పందాల చేసుకుంది. మొత్తం రూ.12,062 కోట్ల పెట్టుబడులు సాధించింది. దీనిద్వారా తెలంగాణలో యువతకు 30,500 ఉద్యోగావకాశాలు లభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రైజింగ్ బృందం జపాన్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆ బృందం పలు కీలక ఒప్పందాలు చేసుకుంది. ఏడు రోజుల పర్యటనలో మొత్తం రూ.12,062 కోట్ల పెట్టుబడులు సాధించింది. దీనిద్వారా తెలంగాణలో యువతకు 30,500 ఉద్యోగావకాశాలు లభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు జపాన్‌కు చెందిన మారుబెని కంపెనీ ఒప్పందం చేసుకుంది. రూ.1000 కోట్ల ప్రారంభ పెట్టుబడి పెట్టనుంది.
మొత్తంగా రూ.5 వేల కోట్ల పెట్టుబడులకు అంచనా వేసింది. అలాగే NTT డేటా, నెయిసా సంస్థలతో కూడా తెలంగాణ సర్కార్ ఒప్పందం చేసుకుంది. ఈ కంపెనీలు మొత్తం రూ.10,500 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేయనున్నాయి. తోషిబా ట్రాన్స్‌మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా (TTDI)తో సైతం ఒప్పందం కుదిరింది. ఆ కంపెనీ రూ.562 కోట్లతో రుద్రారంలోని విద్యుత్ పరికరాలు, సామగ్రి తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది.
ఈ కంపెనీల ద్వారా దాదాపు యువతకు 30,500 ఉద్యోగాలు రానున్నాయి. తెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలో టామ్ కామ్‌తో టెర్న్, రాజ్ గ్రూప్‌లు చేసుకున్న ఒప్పందాలు వల్ల రాష్ట్రానికి చెందిన 500 మందికి జపాన్‌లో ఉద్యోగ నియామకాలకు మార్గం సుగమమైంది. ఇదిలాఉండగా.. సీఎం రేవంత్ బృందం ఏప్రిల్ 15న జపాన్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 22 వరకు అక్కడ పర్యటించింది. ఈ పర్యటనలో సీఎం రేవంత్ వెంట మంత్రి శ్రీధర్ బాబు, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు ఉన్నారు.