Lord Venkateswara: 'శని'కి చెక్‌ పెట్టే దేవుడు.. వెంకటేశ్వరుడు..! శనివారం ఎందుకు పూజించాలో తెలుసుకోండి!

శనివారం వెంకటేశ్వరస్వామిని ప్రత్యేకంగా పూజించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. శనిదేవుడు మనపై చూపే చెడు ప్రభావల నుంచి విముక్తి చేసే శక్తి వెంకటేశ్వరుడికి ఉందని భక్తుల నమ్మకం. శనివారం బాలాజీని పూజిస్తే అదృష్టం, సంపద, శ్రేయస్సు వస్తుందని నమ్ముతారు. అందుకే ఆయన ఆశీర్వాదం కోసం భక్తులు శనివారం వెంకటేశ్వరుడి ఆలయాలను సందర్శిస్తారు.

New Update
Lord Venkateswara: 'శని'కి చెక్‌ పెట్టే దేవుడు.. వెంకటేశ్వరుడు..! శనివారం ఎందుకు పూజించాలో తెలుసుకోండి!

వారంలో ఒక్కో రోజును ఒక్కో దేవుడికి అంకితం చేశారు హిందువులు. సోమవారం శివుడికి, మంగళవారం ఆంజనేయస్వామికి, బుధవారం గణపతికి, అయ్యప్పస్వామికి.. గురువారం, దత్తాత్రేయుడు, సాయిబాబాకి.. శుక్రవారం లక్ష్మీదేవికి, శనివారం వేంకటేశ్వరుడికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు భక్తులు. శనివారం కలియుగ దైవం వెంకటేశ్వరస్వామిని పూజిస్తారు. ప్రతీ శనివారం భక్తులు చాలామంది వెంకటేశ్వర ఆలయాలకు వెళ్తారు. అక్కడ ప్రదక్షణలు చేస్తే సకల దోషాలు పోతాయని వారి నమ్మకం. ఇక శనివారం వెంకటేశ్వరుడిని ప్రత్యేకంగా పూజించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని భక్తులు నమ్ముతారు. అవేంటో చూడండి.

మతపరమైన ప్రాముఖ్యత: శనివారం శని (Saturn)తో సంబంధం కలిగి ఉంటుంది. శనిగ్రహం మనపై చూపే నెగిటివ్‌ శక్తిని పాజిటివ్‌ చేసే ఎనర్జి వెంకటేశ్వరస్వామికి ఉందని ప్రజలు నమ్ముతారు. ప్రతికూల ప్రభావాల నుంచి స్వామి కాపాడుతాడని వారి విశ్వాసం. అందుకే శనివారం వెంకటేశ్వరుడి ఆశీర్వాదాన్ని భక్తులు కోరుకుంటారు.
పురాణాలు: బాలాజీ అని పిలుచుకునే మన వెంకటేశ్వరుడు విష్ణువు రూపంగా భావిస్తారు. దేశంలో అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటైన తిరుమల దేవాలయం వెంకటేశ్వరుడికి కోసమే అంకితం చేశారు. మానవాళిని రక్షించడానికి వేంకటేశ్వరుడు భూమిపై ఉద్భవించిన రోజు శనివారం అని చెబుతారు.

సమయం: శనివారం వేంకటేశ్వరుడిని పూజించడానికి పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. ఇది అదృష్టం, సంపద, శ్రేయస్సును తీసుకొస్తుందని నమ్ముతారు. ఆర్థిక స్థిరత్వంతో పాటు ఆయన ఆశీర్వాదం కోసం భక్తులు శనివారం వెంకటేశ్వరుడి ఆలయాలను సందర్శిస్తారు. ఉపవాసం: చాలా మంది భక్తులు శనివారాలలో ఉపవాసాలు ఉంటారు. వెంకటేశ్వరుని పట్ల తమ భక్తిని చాటుకుంటారు.

ఆధ్యాత్మికం: శనివారపు ఆరాధన ఆధ్యాత్మిక ప్రక్షాళన కూడా చేస్తుందని పండితుల విశ్వాసం. ఒకరి పాపాలకు లేదా గతంలో చేసిన తప్పులకు క్షమాపణ కోసం శనివారం ఉపయోగపడుతుందని చెబుతారు.
సంప్రదాయం: శనివారాలలో వేంకటేశ్వరుడిని పూజించే సంప్రదాయం చాలా మంది హిందువులకు.. ముఖ్యంగా దక్షిణ భారత్‌లో ఆచారంగా మారింది. అయితే అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడి శక్తి కేవలం శనివారమే కాదు. మిగిలిన రోజుల్లోనూ ఉంటుంది. నమ్మకం ఉంటే ఏ రోజైనా ఏ గుడికైనా వెళ్లవచ్చు.

ఇది కూడా చదవండి: రెడ్ కలర్ లెహంగా‌లో సితార ఫొటోలు వైరల్

Advertisment
Advertisment
తాజా కథనాలు