Karthika Masam : కార్తీక మాసం ఆఖరి సోమవారం..శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు! కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే మహిళలు దీపాలు వెలిగించి ఆలయాలను దర్శించుకుంటున్నారు. By Bhavana 11 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Last Monday : కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో రద్దీగా మారాయి. ఈ క్రమంలో ఏపీలోని శ్రీశైలానికి భక్తులు పోటేత్తారు. తెల్లవారు జాము నుంచే భక్తులు నదీ స్నానాలు ఆచరిస్తున్నారు. దీపాలు వెలిగించి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. శివునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసి పూజలు నిర్వహిస్తారు భక్తులు. శ్రీశైలం(Srisailam) లో కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఆలయ పుష్కరిణిలో లక్ష దీపోత్సవం , పుష్కరిణీ హారతి నిర్వహిస్తున్నారు. పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తుండడంతో వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు మంచినీరు అందిస్తున్నారు. మరో వైపు విజయవాడలో కృష్ణానదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. దుర్గాఘాట్, భవానీ ఘాట్, పున్నమి ఘాట్‌లలో భక్తుల రద్దీ పెరిగింది. సోమవారం నాడు సప్త నదుల సంగమేశ్వర ఆలయంలో కల్యాణ మహోత్సవం రుద్ర హోమం, మృత్యుంజయ హోం, పూర్ణాహుతి నిర్వహించనున్నారు. ఇటు తూర్పు గోదావరి జిల్ల కొవ్వూరులో కార్తీక మాసం(Karthika Masam) చివరి వారం కావడంతో గోష్పాద క్షేత్రం తెల్లవారుజాము నుంచే భక్తులతో కళకళలాడుతుంది. అటు తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్బంగా భక్తుల రద్దీ పెరిగింది. స్వామిని దర్శించుకునేందుకు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతోంది. Also read: శబరిమలలో పెరిగిన భక్తుల రద్దీ.. వర్చువల్ క్యూ బుకింగ్ తగ్గింపు! #lord-shiva #devotees #karthikamasam #last-monday #sivalayam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి