/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-53-jpg.webp)
annamaiah crime news
AP Crime: ఏపీలో విషాదం చోటు చేసుకుంది. సరదాకు ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు పాణాలు కోల్పోయారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. అప్పటి వరకు ఆ ఊరంతా రామ నామస్మరణతో మార్మోగింది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా.. గ్రామస్థులంతా ఉత్సవ కార్యక్రమాన్ని చూసేందుకు వెళ్లారు. పండుగ వేళ ఉరంతా సంతోషంగా ఉన్న సమయంలో ఓ విషాదం జరిగింది. వేడుక అనంతరం ముగ్గురు పిల్లలు కనిపించకుండా పోయారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు నీటి కుంటలో పడి ప్రాణాలు కోల్పోయారు. కన్న బిడ్డులు మృతి చెందిన విషయం తెలుసుకుని విషాదంలో మునిగిపోయారు.
ప్రాణం తీసిన ఈత..
ఈ హృదయ విషాదకర సంఘటన శుక్రవారం జరిగింది. చిట్వేలి మండలంలో ఎం. రాచపల్లికి చెందిన చొక్కరాజు నరసింహరాజుకు కుమారుడు దేవాన్ష్ (6), శేఖర్‌రాజు కుమారుడు విజయ్ (6), వెంకటేష్ కుమారుడు యశ్వంత్ (7)లు కలిసి గ్రామంలో జరిగిన సీతారాముల ఉభయంలో పాల్గొన్నారు. అనంతరం ఊరి సమీపంలోని నీటి కుంట దగ్గరకు ఈత కొట్టేందుకు వెళ్లారు. నీళ్లలో దిగి ఈత రాక.. ప్రమాదవశాత్తు మునిగి మృత్యువాత పడ్డారు. పిల్లల ఈతకు వెళ్లి మృతి చెందిన విషయం తెలియక కుటుంబ సభ్యులు ఆలయం దగ్గర ఉన్నారు అనుకోని ఇంటికి వెళ్లారు.
ఇది కూడా చదవండి: యువతకు నోటి క్యాన్సర్ ముప్పు..ఈ లక్షణాలను అశ్రద్ధ చేయొద్దు
సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో ఆలయ మైకులో పేర్లు చెప్పించారు. అయినా ఆచూకీ తెలియకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఊరు బయట ఉన్న నీటి కుంట దగ్గర వెతకగా.. ముగ్గురి మృతదేహం లభ్యమైంది. విజయ్, యశ్వంత్‌ల తల్లితండ్రులు జీవనాధారం కోసం గల్ఫ్ దేశానికి వెళ్లారు. చిట్వేలిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో వీరిని చదివిస్తున్నారు. ఒక్కసారి ముగ్గురు పిల్లలు శవాలై కనిపించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. పిల్లల మరణానికి కారణమైందని గ్రామ ప్రజలు అంటున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: వేసవి విడిది కోసం బెస్ట్ ప్లేసులు ఇవే
( ap-crime-news | ap crime latest updates | latest-news )
AP: జగన్ రెడ్డి పైశాచికత్వానికి ఇదే నిదర్శనం: దేవినేని ఉమా
జగన్ రెడ్డి రివర్స్ టెండర్ల నిర్ణయాల వల్లే బుడమేరు నుండి బెజవాడ పైకి వరద పోటెత్తిందని టీడీపీ నేత దేవినేని ఉమా మండిపడ్డారు. ఫ్లడ్ వస్తే తాడేపల్లి కొంపలో ఉండి వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించిన జగన్ నేడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆయన పైశాచికత్వానికి నిదర్శనమన్నారు.
Devinneni Uma: మాజీ సీఎం జగన్ రెడ్డి తప్పుడు, అహంకారపూరిత, మూర్కపు, రివర్స్ టెండర్ల నిర్ణయాల వలనే నేడు బుడమేరు నుండి బెజవాడ పైకి వరద పోటెత్తిందని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ నిర్లక్ష్యం, తెలివితక్కువ తనం, ఆయన పిచ్చి పనుల వలనే ప్రజలకు ఇంతటి వ్యథ మిగిలిందన్నారు. గతంలో బుడమేరుకు చంద్రబాబు డబ్బులు కేటాయించినా జగన్ పట్టించుకోలేదని.. చంద్రబాబు ఇచ్చిన డబ్బులను ఖర్చు చేసి ఉంటే నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు.
బుడమేరు వరద వలన లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోవడమే కాకుండ.. లక్షలాది మంది ప్రజలు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ఈ కష్టకాలంలో అయినా ప్రజలకు సాయం చేయకపోగా విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రకాశం బ్యారేజ్ వద్దకు కొట్టుకు వచ్చి ఢీకొట్టిన బోట్లకు వైసీపీ రంగులు కనిపిస్తున్నాయన్నారు. వాటిని తియడానికి నేడు వందల మంది పనిచేయాల్సి వస్తోందని తెలిపారు.
Also Read: మాజీ మంత్రి జోగి రమేష్ కోసం పోలీసుల వేట..!
గతంలో వైసీపీ హయాంలో పులిచింతల గేటు కొట్టుకుపోతే అది పెట్టడానికి గత ప్రభుత్వానికి నాలుగైదేళ్లు పట్టింది. గుండ్లకమ్మ గేటు కొట్టుకుపోతే పట్టించుకోలేదని.. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి ప్రజల ప్రాణాలు పోతే పట్టించుకోలేదని.. పూంచా రిజర్వాయర్ కోట్టుకుపోయినా పట్టించుకోలేదని.. ఇంత జరిగినా కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఇలాంటి వ్యక్తా ఐదేళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిందని సిగ్గుగా ఉందన్నారు.
వెలగలేరు గెట్లు ఎత్తి పారిపోయారని చెప్పడం గడ్డితినేవారు మాట్లాడే మాటలేనన్నారు. ఇంత పెద్దఎత్తున వరద వస్తే.. కష్టాల్లో ఉన్న ప్రజలకు అర్థరాత్రి అపరాత్రి అని చూడకుండా వయస్సును కూడా లెక్కబెట్టకుండా ప్రజలకోసం పనిచేస్తుంటే.. కనీస జ్ఞానం లేకుండా విమర్శిస్తారా? వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు పరామర్శకు వెళుతుంటే వరద బాధితులే తరిమి కొడుతున్నారన్నారు. వరద బాధితుల మాటలకు తెల్లబోయి మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక జగన్ రెడ్డి తెల్లమొఖం వేసుకు వెళ్లాడన్నారు.
గోదావరికి వరదలు వస్తే కచ్చులూరు బోటు ప్రమాదంలో 55 మంది చనిపోతే ఇంట్లో నుండి బయటకు రాకుండా పరాదలు కట్టుకుని హెలికాఫ్టర్ లో తిరిగిన జగన్ మళ్లీ విమర్శిస్తున్నాడని దుయ్యబట్టారు. 2022లో గోదావరికి వరదలు వస్తే పక్క రాష్ట్రాలో ఇచ్చిన వరద సాయం కూడా చేయకపోగా.. కనీసం బాధితులకు మంచినీళ్లు ఆహారం కూడా ఇవ్వలేదన్నారు. ఫ్లడ్ వస్తే తాడేపల్లి కొంపలో ఉండి వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించిన జగన్ రెడ్డి నేడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆయన పైశాచికానికి నిదర్శనమన్నారు. చీకటి అని కూడా లెక్క చేయకుండా మంత్రులందరూ బాధ్యతగా తీసుకుని బుడమేరుకు పడిన గండ్లు పూడ్చారన్నారు. బుడమేరు వరద బాధితులకు, రైతాంగానికి జగన్ రెడ్డి క్షమాణ చెప్పాలని.. ఆనాటి పాలనను గుర్తుకు తెచ్చుకుని సిగ్గుతో ముక్కును నేలకు రాయాలన్నారు.
AP Crime: అయ్యో బిడ్డలు.. ఈత కోసం వెళ్లి తిరిగి రాని లోకానికి
అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలంలో విషాదం చోటు చేసుకుంది. కుంటలో మట్టి కోసం తవ్విన గుంతలో పడి దేవాన్ష్ (6), విజయ్ (6), యశ్వంత్ (7) లు ప్రాణాలు కోల్పోయారు. క్రైం | Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్
ఏపీ ఇంటర్ ఫలితాలు నేడే.. రిజల్ట్స్ ఈజీగా తెలుసుకోండి
వాట్సాప్‌లో 9552300009కు హాయ్ అని మెసేజ్ చేస్తే మీ రిజల్ట్స్ వస్తాయని లోకేష్ తెలిపారు. Short News | Latest News In Telugu | జాబ్స్ | ఆంధ్రప్రదేశ్
🔴Live News Updates: ఒకేరోజు వందల మందికి గూగుల్ లేఆఫ్..!
Stay updated with the Latest News In Telugu! Get breaking news, politics క్రైం | టెక్నాలజీ | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Ap Govt: నేడు వారికి సెలవు రద్దూ..ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండో శనివారం కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులు పనిచేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఏపీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
AP: గోరంట్ల మాధవ్ కు ఏప్రిల్ 24 వరకు రిమాండ్
మాజీ ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్ కు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఇతనితో పాటూ మిగతా ఐదుగురికి కూడా కోర్టు రిమాండ్ విధించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | గుంటూరు | ఆంధ్రప్రదేశ్
🔴Live News Updates: ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో విస్తరణ: సీఎం రేవంత్
Stay updated with the Latest News In Telugu! Get breaking news, politics క్రైం | టెక్నాలజీ | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Breaking: వనజీవి రామయ్య కన్నుమూత
West Bengal: బెంగాల్లో చెలరేగిన హింస.. రైల్వే ట్రాక్‌లు ధ్వంసం
IPL 2025: ధోనీ అవుట్ కాదా? వివాదాస్పదమౌతున్న థర్డ్ అంపైర్ నిర్ణయం
Shrasti Verma: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!
Mangoes: మామిడి పండ్లు తినేప్పుడు ఈ తప్పులు చేయొద్దు