Health:బాడీలో చెత్తను తొలగించే డీటాక్స్ వాటర్...ఎన్ని ప్రయోజనాలో తెలుసా? మన బాడీకి శక్తి ఎంత అవసరమో డీటాక్స్ కూడా అంతే అవసరం. మనం రోజూ తీసుకునే ఆహారంలో మనకు కావల్సిన పదార్ధాలు ఎన్ని ఉంటామో అక్కరలేనివి కూడా అన్నే ఉంటాయి. వాటిలో కొన్నింటిని మన శరీరమే బయటికి పంపిస్తోంది. మిగతావాటిని మనమే తొలిగించుకోవాలి. అలాంటివాటి కోసమే ఈ డీటాక్స్ డ్రింక్స్.. By Manogna alamuru 22 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి మన చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా కనిపించడానికి.. మనం తీసుకునే ఆహారం, మంచి లైఫ్‌స్టైల్, సరైన చర్మ సంరక్షణ చాలా ముఖ్యం. అదే విధంగా, ఆరోగ్యకరమైన చర్మానికి బాడీ డిటాక్సిఫికేషన్ కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే.. శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతే చర్మం సమస్యలు ఎదరువుతాయి, చర్మాన్ని నిర్జీవంగా మారుస్తుంది. డిటాక్స్ డ్రింక్స్ చర్మంలో పేరుకున్న మలినాలు, చెత్తను తొలగిస్తాయి. పసుపు వేడి నీరు.. శరీరంలో, చర్మంలో పేరుకున్న మలినాలు తొలగించడానికి.. పసుపు నీరు ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్‌లో శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇది మొటిమలు, తామర, మరికొన్ని చర్మ సమస్యలను నివారిస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్ రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. ఒక గ్లాసు నీటిని మరిగించి అందులో అర టీస్పూన్ పసుపు వేయాలి. నీరు గోరువెచ్చగా అయిన తర్వాత నిమ్మరసం, తేనె వేసి కలిపి తాగాలి. యాపిల్ సైడర్ వెనిగర్... యాపిల్ సైడర్ వెనిగర్‌లో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్ శరీరం నుంచి టాక్సిన్స్‌ను తొలగిస్తాయి, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. యాపిల్ సైడర్ వెనిగర్ తో ఒంట్లోని కొవ్వు కూడా కరుగుతుంది. గోరువెచ్చని నీటిలో రెండు స్పూన్ల వెనిగర్ , తేనె కలుపుకుని తాగాలి. కానీ రోజుకు రెండు స్పూన్ల కంటే ఎక్కువ తాగకూడదు. ఈ విషయాన్ని బాగా గుర్తు పెట్టుకోవాలి. కీరా వాటర్... కీరా మన శరీరానికి చాలా మేలు చేస్తుంది. శరీరాన్ని హైడ్రేటింగ్‌గా ఉంచుతుంది. దీనిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఫ్రీరాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. కీరాతో పాటూ పుదీనాను కూడా కలుపుకుంటే ఇంకా మంచింది. పుదీనా జీర్ణక్రియకు మేలు చేస్తుంది. పుదీనా ఆకులు, కీరా దోస ముక్కలు, కొంచెం నిమ్మరసం, నీళ్లు వేసి కొన్ని గంటలు అలా వదిలేయాలి. ఆ తర్వాత.. ఈ నీటిని తాగండి. ఈ డ్రింక్ తాగిన తర్వాత మీ వరీరం మీద మచ్చుంటే ఒట్టు. మామూలు నీరుకు బదులుగా ఈ నీటిని రోజంతా కూడా తీసుకోవచ్చును. కొబ్బరి నీళ్ళు... శరీరంలోని ప్రతి కణానికి సరైన మోతాదులో ఆక్సిజన్ అవసరం. సరైన రక్తప్రసరణ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. అలాగే చర్మం ఆరోగ్యంగా, నవయవ్వనంగా కనిపించేలా చేసే గుణం కొబ్బరి నీళ్ళుల్లో పుష్కలంగా ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. ఇది శరీరం నుంచి వ్యర్థాలు, టాక్సిన్స్‌ను తొలగిస్తుంది. #health #benifits #detox-water #purify మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి