Pawan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత..!

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు. జ్వరంతోనే వరద ప్రభావిత ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. పవన్ కుటుంబ సభ్యులు సైతం వైరల్ జ్వరాలతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది.

New Update
Pawan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత..!

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ జ్వరం, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు. అస్వస్థతతో ఉన్నప్పటికీ ఉదయం తన నివాసంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ అధికారులతో సమావేశమయ్యారు. వరద పరిస్థితిపై సమీక్షించారు. వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని, సూపర్ క్లోరినేషన్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Also Read: మాజీ మంత్రి జోగి రమేష్ కోసం పోలీసుల వేట..!

అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం, దోమల బెడద తీవ్రత ఉన్నందున పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలన్నారు. స్వచ్ఛమైన తాగు నీరు సరఫరా చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకొంటూ నిరంతర పర్యవేక్షణ చేయాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం ఏలేరు రిజర్వాయర్ కి వరద ముప్పుపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రివర్యులు వైద్యుల సూచనలు తీసుకొంటున్నారు. ఉప ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు సైతం వైరల్ జ్వరాలతో బాధపడుతున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: పవన్ కల్యాణ్ కు తీవ్ర అనారోగ్యం.. కేబినెట్ మీటింగ్ మధ్యలోనే బయటకు..!

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. కేబినెట్ల సమావేశం కోసం హైదరాబాద్ నుంచి ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆయన సచివాలయానికి వచ్చారు. అయితే.. అనారోగ్య కారణంతో ఆయన తిరిగి వెళ్లిపోయారు. 

New Update
Pawan Kalyan Health Issues

Pawan Kalyan Health Issues

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. కేబినెట్ సమావేశం కోసం హైదరాబాద్ నుంచి ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆయన సచివాలయానికి వచ్చారు. అయితే.. అనారోగ్య కారణంతో ఆయన తిరిగి వెళ్లిపోయారు. 

Advertisment
Advertisment
Advertisment