Khammam: ఖమ్మం ఎంపీగా డిప్యూటీ సీఎం భట్టి సతీమణి?

తెలంగాణలో ఎంపీ అభ్యర్థులపై కసరత్తు ప్రారంభించింది కాంగ్రెస్. ఈ క్రమంలో ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం భట్టి సతీమణి నందినికి టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఖమ్మం నుంచి ఎంపీగా సోనియా గాంధీ పోటీ చేస్తారనే ప్రచారం గతంలో జరిగింది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

New Update
Khammam: ఖమ్మం ఎంపీగా డిప్యూటీ సీఎం భట్టి సతీమణి?

Khammam MP Ticket: తెలంగాణ పగ్గాలను చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ (Congress Party) దేశ పగ్గాలను కూడా తమ చేతిలోకి తీసుకోవాలని భావిస్తోంది. మరి కొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) తెలంగాణతో పాటు దేశంలో మూడు రంగుల జెండా ఎగవేయాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ఎంపీ అభ్యర్థుల (Congress MP Candidates) ఎంపిక పై కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గెలుపు గుర్రాలకే ఎంపీ టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ హైకమాండ్ డిసైడ్ అయినట్లు సమాచారం.

ALSO READ: సర్పంచ్ పదవికి మాత్రమే విరమణ.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

ఖమ్మం ఎంపీగా భట్టి భార్య..

ఖమ్మం ఎంపీ టికెట్ కేటాయింపు పై కాంగ్రెస్ అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) ఖమ్మంలో (Khammam) పది స్థానాలకు గాను తొమ్మిది స్థానాల్లో విజయకేతనం ఎగరవేసింది కాంగ్రెస్. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కు కంచుకోటగా మారింది. ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) సతీమణి మల్లు నందినికి (Bhatti Nandhini) ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఖమ్మం ఎంపీ స్థానం కోసం మల్లు నందిని పేరిట దరఖాస్తు వచ్చింది. మల్లు నందిని తరపున గాంధీభవన్‌లో దరఖాస్తు చేశారు ఖమ్మం డీసీసీ చీఫ్‌ పువ్వాళ్ల దుర్గా ప్రసాద్‌, కాంగ్రెస్‌ నేతలు. ఖమ్మం ఎంపీగా పోటీ చేయాలనుందని గతంలోనే నందిని చెప్పారు.

రేసులో సోనియా గాంధీ, పొంగులేటి సోదరుడు..?

కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. అయితే.. ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చ దేశ రాజకీయాల్లో మొదలైంది. గతంలో ఎంపీ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్‌ బరిలో సోనియాగాంధీ ఉండనున్నట్లు వార్తలు వచ్చాయి. ఖమ్మంలో బీజేపీకి డిపాజిట్లు లేవు.. అలాగే తెలంగాణ ఎన్నికల్లో ఓటమిని చవి చూసిన బీఆర్‌ఎస్‌ పార్టీ కూడా కోలుకోలేని పరిస్థితిలో ఉంది. అలాగే కాంగ్రెస్‌కు పూర్తి మద్దతు అని వామపక్షాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేస్తే ఈజీగా గెలవచ్చని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. అలాగే.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ సోదరుడు ప్రసాద్‌ రెడ్డి ఖమ్మం ఎంపీ టికెట్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. మరి కాంగ్రెస్ హైకమాండ్ ఎవరికి టికెట్ ఇస్తుందో మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది.

ALSO READ: గుడ్ న్యూస్.. రూ.29లకే కిలో బియ్యం.. కేంద్రం కీలక ప్రకటన

DO WATCH: 

Advertisment
Advertisment
తాజా కథనాలు