Kavitha: కవితకు షాక్.. బెయిల్ నిరాకరణ!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు షాక్ తగిలింది. సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది.  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్ట్ చేయడం అక్రమమంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్యం పాలసీ రూపకల్పనలో కవిత రూ.100 కోట్ల అక్రమాలకు పాల్పడినట్టు అభియోగాలున్నాయి.

New Update
Kavitha: కవితకు షాక్.. బెయిల్ నిరాకరణ!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు షాక్ తగిలింది. సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవితను మార్చి 15న హైదరాబాద్‌లో అరెస్టు చేసిన రూస్ అవెన్యూ కోర్టు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించి మార్చి 23 వరకు ఈడీ కస్టడీకి పంపింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్ట్ చేయడం అక్రమమంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ట్రయల్ కోర్టుకే వెళ్లాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ట్రయల్ కోర్టులోనే బెయిల్ అప్లయ్ చేసుకోవాలని చెప్పింది సుప్రీం కోర్టు. PMLA కేసులతో ట్యాగ్ చేసింది ధర్మాసనం. మహిళ కాబట్టి ట్రయల్ కోర్టు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. ఈడీకి నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆరు వారాల్లో ఈడి తమ కౌంటర్ ఫైల్ చేయాలని ఆదేశించింది.

కవిత పాత్ర ఏంటి?
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమార్తె అయిన కవితకు అనేక వ్యాపారాల్లో భాగస్వామ్యం ఉంది. అందులో 'సౌత్ గ్రూప్' (South Group) ఒకటి. ఈ గ్రూప్‌ని కంట్రోల్‌ చేసే వారిలో వారిలో కవిత ఒకరు. ఢిల్లీ ప్రభుత్వ మద్యం పాలసీ రూపకల్పనలో ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులకు అనుకూలంగా వ్యవహరించినందుకు ఆప్‌ ప్రతినిధి విజయ్ నాయర్‌కు కవితకు చెందిన సౌత్ గ్రూప్ రూ.100 కోట్లు ముడుపులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.

కవిత చుట్టూ ఉచ్చు ఎలా బిగుసుకుంది?
హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్రన్ పిళ్లైని (Ramachandran Pillai) గతేడాది(2023) మార్చిలో ఈడీ అరెస్ట్ చేసింది. సౌత్ గ్రూప్‌లో పిళ్లై కీలక సభ్యుడు. కవితకు కీలక సూత్రధారిగా, గ్రూప్‌ ఫ్రంట్ మ్యాన్‌గా పిళ్లై కవిత సూచనల మేరకే వ్యవహరించారని ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. అంతేకాదు వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవ మాగుంట, అరబిందో ఫార్మాకు చెందిన శరత్ చంద్రారెడ్డిలతో కూడిన 'సౌత్ గ్రూప్' ఈ లిక్కర్‌ స్కామ్‌లో అవినీతికి పాల్పడిందన్న ఆరోపణలు ఉన్నాయి. కవిత ప్రయోజనాలకు పిళ్లై ప్రాతినిధ్యం వహించారని ఈడీ పేర్కొనగా. పిళ్లై ఈ విషయాన్ని తమ వాంగ్మూలంలో చెప్పారు. ఇక ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో పిళ్లై ప్రమేయం ఉందని, విజయ్ నాయర్ కు ఇన్ పుట్స్ ఇచ్చారని చెబుతోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు