CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు 6 రోజుల కస్టడీ

లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు షాక్ తగిలింది. ఆయనకు ఆరు రోజుల ఈడీ కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. ఈ నెల 28న మధ్యాహ్నం 2 గంటలకు కోర్టులో ప్రవేశ పెట్టాలని ఈడీ అధికారులకు ఆదేశాలిచ్చింది.

New Update
CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు మరోసారి షాక్

CM Kejriwal: లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు షాక్ తగిలింది. ఆయనకు ఆరు రోజుల ఈడీ కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. ఈ నెల 28న మధ్యాహ్నం 2 గంటలకు కోర్టులో ప్రవేశ పెట్టాలని ఈడీ అధికారులకు ఆదేశాలిచ్చింది. అయితే.. లిక్కర్ స్కాం కేసులో విచారించేందుకు కేజ్రీవాల్ ను 10 రోజుల కస్టడీ ఇవ్వాలని ఈడీ కోర్టును కోరగా.. ఆరు రోజుల కస్టడీ ఇస్తూ కోర్టు తన తీర్పును వెలువరించింది.

ప్రజాస్వామ్యానికి చీకటి రోజు: ఆప్ మంత్రి

లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు ఆరు రోజులు ఈడీ కస్టడీకి అనుమతిస్తూ ఇచ్చిన తీర్పుపై స్పందించారు ఆప్ నేత, మంత్రి అతిషి మార్లేనా. కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ని అడ్డం పెట్టుకొని బీజేపీ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తోందని మండిపడ్డారు. ఈడీ అనేది బీజేపీ పార్టీలో ఒక భాగమా? అని నిలదీశారు. ఈడీ ఇవ్వాల్సిన ప్రెస్ రిలీజ్లను బీజేపీ నేతలు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పటి వరకు ఆప్ నేతలు ఎలాంటి నేరాలకు పాల్పడినట్లు ఈడీ కనుగొనలేదని అన్నారు. దేశ ప్రజాస్వామ్యానికి ఈరోజు చీకటి రోజు అని ఆమె తెలిపారు. బీజేపీ భారత్ లో ప్రజాస్వామ్యాన్ని ఎలా కూని చేస్తుందో ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.

రేపటి ముగియనున్న కవిత ఈడీ కస్టడీ..

లిక్కర్ స్కాన్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ రేపటి తో ముగియనుంది. ఈ నెల 15న ఈడీ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆమెకు రౌస్ అవెన్యూ కోర్టు వారం రోజుల ఈడీ కస్టడీ విధించింది. ఇప్పటి వరకు మొత్తం ఆరు సార్లు ఎమ్మెల్సీ కవితను పలు కోణాల్లో విచారించారు. ఈడీ కస్టడీలో ఉన్న కవితను కుటుంబ సభ్యులు కలిసేందుకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ కవితను మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఆమె తల్లి, కుమారుడు, భర్త అనిల్ కలిశారు. మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీలోనే ఉంటూ కవితను బయటకు తెచ్చే అంశంపై న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే  మరోవైపు సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ తో కవిత ఈడీ కస్టడీని మరికొన్ని రోజులు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరినీ కలిసి ఈడీ అధికారులు విచారిస్తారనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. మరి కవిత ఈడీ కస్టడీని కోర్టు పొడిగుస్తుందా? లేదా? అనేది వేచి చూడాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు