అప్పులు తీరాయా?మిగిలాయా? దొర.. సీఎం కేసీఆర్‌పై షర్మిల సెటైర్లు

సీఎం కేసీఆర్ చేసిన అప్పులపై వైఎస్ షర్మిల ఆరోపణలు గుప్పించారు. ధనిక రాష్ట్రాన్ని ధన దాహానికి సీఎం కేసీఆర్ బలి చేశారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై షర్మిల నిలదీశారు. అప్పుల మీద అప్పులు మోపేది..? తెలంగాణ నెత్తిన ఎప్పటికీ గుదిబండే..! రాష్ట్ర సొమ్మును వడ్డీలకు, నిర్వహణకు కాజేసే కన్నీటి సౌధం.. కాళేశ్వరం ముమ్మాటికీ కేసీఆర్ వైట్ ఎలిఫెంట్? అంటూ షర్మిల మండిపడ్డారు.

New Update
అప్పులు తీరాయా?మిగిలాయా? దొర.. సీఎం కేసీఆర్‌పై షర్మిల సెటైర్లు

Debt paid..left Sir.. Sharmila satires on CM KCR

అప్పులు చేసి దొర

సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. రాష్ట్రం పేరిట అప్పులు చేసి దొర పప్పు కూడు తింటూ ప్రజలకు చిప్ప చేతిలో పెడుతున్నారంటూ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బంగారు తునకలాంటి ధనిక రాష్ట్రాన్ని తన ధన దాహానికి బలి చేశారని ఆరోపించారు. అప్పు పుట్టనిదే.. ఉన్న భూములు అమ్మనిదే రాష్ట్రం ముందుకు పోలేని దీనస్థితికి తెచ్చారంటూ విమర్శించారు.

40వేల ఎకరాలు తడపని ప్రాజెక్టు

"కాళేశ్వరం అప్పులు తీరినయ్ అంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 1.49 లక్షల కోట్లతో కాళేశ్వరం తిప్పిపోతల పథకం కట్టిన కేసీఆర్ గారు.. మూడేండ్లకే మునిగిన ప్రాజెక్టుతో 80వేల కోట్ల అప్పెట్ల తీర్చారు?" అంటూ ప్రశ్నించారు. రోజుకు 3 TMCలని చెప్పి, అర TMC కూడా ఎత్తలేని ప్రాజెక్టు బాకీలు తీర్చారా?.. ఎత్తిపోసిన 157 టీఎంసీలలో 100 టీఎంసీలను గోదాట్లో పోసినందుకు బాకీలు తీరినయా? అంటూ షర్మిల వ్యంగ్యాస్త్రాలు సంధించారు. " లక్ష ఎకరాల సాగుకు దిక్కులేని ప్రాజెక్టుతో వడ్లు ఉష్కె లెక్క పండినయా? ప్రతి సీజన్ లో పట్టుపని 40వేల ఎకరాలను కూడా తడపని ప్రాజెక్టుతో రైతులకు డబ్బులే డబ్బులా?" అంటూ ఆమె వ్యాఖ్యనించారు.

రైతుకు దిక్కేలేనట్లు ఉంది

ప్రతి సీజన్‌లో పట్టుమని 40 వేల ఎకరాలను కూడా తడపని ప్రాజెక్టుతో రైతులకు డబ్బులే డబ్బులా? అంటూ ఎద్దేవా చేశారు. మీరు పుట్టకపోతే తెలంగాణలో వ్యవసాయమే లేనట్లు.. ప్రాజెక్టు కట్టకపోతే రైతుకు దిక్కేలేనట్లు ఉంది మీ వ్యవహారం ఉందన్నారు. 70 ప్రాజెక్టుల పాత ఆయకట్టును కనికట్టు చేసి కొత్త ఆయకట్టుగా చూపి.. కాళేశ్వరం ఖాతాలో వేసినంత మాత్రానా కోటి ఎకరాలకు తడిపినట్లు కాదు దొర అంటూ ఫైర్‌ అయ్యారు. విస్తారంగా వర్షాలు పడి, పాత ప్రాజెక్టులు నిండినయే తప్పా.. మీ కాసులధార కాళేశ్వరం ఒక్కటీ నింపలేదని మండిపడ్డారు.

అప్పుల్లో తెలంగాణ ఐదో స్థానం

మీ 9 ఏళ్ల పాలనలో 15 లక్షల కొత్త బోర్లు పడ్డాయంటే, మీ డ్రీమ్డ్ ప్రాజెక్ట్ అంతా బోగస్ అని తేలిపోయిందని షర్మిల సెటైర్లు వేశారు. మీ కమీషన్ల సౌధం కాళేశ్వరం అప్పులు తీర్చేది కాదని.. అప్పుల మీద అప్పులు మోపేది మీరే అని విమర్శలు చేశారు. తెలంగాణ నెత్తిన ఎప్పటికీ గుదిబండే పడిదని.. రాష్ట్ర సొమ్మును వడ్డీలకు, నిర్వహణకు కాజేసే కన్నీటి సౌధం అని వ్యాఖ్యనించారు. తెచ్చిన రూ.97,447కోట్లకు అదనంగా రూ.71,575 కోట్లు కలిపి కట్టే ఫలితం లేని ప్రాజెక్ట్ కాళేశ్వరం అన్నారు. నిర్వహణ కింద ఏటా రూ.23వేల కోట్లు బూడిదలో పోసిన పన్నీరుతో సమానమే అన్నారు. అప్పులు తీర్చి, ఖజానా నింపుకున్నది కేసీఆర్ మాత్రమే అని.. అందుకే దొరకు కాళేశ్వరం ఒక ATM అన్నారు. మీ బంధిపోట్ల పాలనలో రైతుల జేబులకు చిల్లులు పడ్డయ్ తప్పితే.. జేబులు నిండలేదన్నారు. దేశంలోని రైతులకు ఉన్న అప్పుల్లో తెలంగాణ ఐదో స్థానంలో ఉందని.. రైతుల ఆదాయంలో 25వ స్థానంలో ఉందన్నారు. ఇప్పుడు చెప్పండి దొర..!! మీరు కట్టిన కాళేశ్వరం పుణ్యాన..రైతులకు అప్పులు తీరినయా? అప్పులు మిగిలినయా? అంటూ ప్రశ్నించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు