Frog In Chips Packet : చిప్స్ ప్యాకెట్ లో చచ్చిన కప్ప..ఖంగుతిన్న కస్టమర్లు!

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో తాజాగా చిప్స్‌ ప్యాకెట్లో చచ్చిన కప్ప వచ్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది. జాస్మిన్‌ అనే మహిళ తన మేనకోడలి కోసం కొన్న చిప్స్‌ ప్యాకెట్లో చచ్చిన కప్ప రావడంతో ఆమె ఫుడ్‌ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసింది.

New Update
Frog In Chips Packet : చిప్స్ ప్యాకెట్ లో చచ్చిన కప్ప..ఖంగుతిన్న కస్టమర్లు!

Gujarat : ఐస్ క్రీమ్‌ లో మనిషి బొటన వేలు... చాక్లెట్‌ సిరప్లో చిట్టెలుక... ఇప్పుడు తాజాగా చిప్స్‌ ప్యాకెట్‌ (Chips Packet) లో చచ్చిన కప్ప. ఇవన్నీ చూస్తుంటే.. మనం ఆహారం తింటున్నామో.. లేక కుళ్లిన.. చచ్చిన జంతువులను తింటున్నామో అర్థం కావడం లేదు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో తాజాగా చిప్స్‌ ప్యాకెట్లో చచ్చిన కప్ప వచ్చినఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

మంగళవారం సాయంత్రం పుష్కర్ ధామ్ సొసైటీకి చెందిన జాస్మిన్‌ పటేల్‌ తన మేనకోడలి కోసం స్థానిక షాపు నుంచి చిప్స్‌ ప్యాకెట్‌ కొనుగోలు చేసింది. ఆ మహిళ కుమార్తె (9 నెలలు), ఆ చిన్నారి కలిసి చిప్స్‌ తిన్నారు. కాగా, చిప్స్‌ ప్యాకెట్‌లో చనిపోయిన కప్ప (Frog) ను ఆ పాప గమనించింది. ఆ వెంటనే ఆ ప్యాకెట్‌ను దూరంగా విసిరేసింది.

ఆ చిప్స్‌ ప్యాకెట్‌ను బాలాజీ వేఫర్స్ (Balaji Wafers) అనే సంస్థ తయారు చేసినట్లు జాస్మిన్‌ గుర్తించింది ఆ కంపెనీ డిస్ట్రిబ్యూటర్‌, కస్టమర్‌ కేర్‌కు వెంటనే ఫోన్‌ చేసింది. అయితే వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో బుధవారం ఉదయం ఫుడ్‌ సేఫ్టీ అధికారికి ఫిర్యాదు చేసింది.

మరోవైపు జామ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ సంఘటనపై వెంటనే స్పందించారు. చిప్స్‌ ప్యాకెట్‌ అమ్మిన షాపును తనిఖీ చేశారు. బాలాజీ వేఫర్స్ తయారు చేసిన చిప్స్‌ ప్యాకెట్ల బ్యాచ్‌ నుంచి శాంపిల్స్ సేకరిస్తామని వివరించారు. దర్యాప్తు తర్వాత తగిన చర్యలు చేపడతామని అధికారులు వెల్లడించారు.

Also read: చిరంజీవి చిన్న కూతురు శ్రీజ-భరద్వాజ్ పెళ్లి.. ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఏం చేశారో తెలుసా?

Advertisment
Advertisment
తాజా కథనాలు