T20 World Cup : క్రిస్ గేల్ రికార్డు బద్దలు కొట్టిన ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్!
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన డేవిడ్ వార్నర్.. టీ20ల్లో అత్యధిక 50+ ప్లస్ స్కోర్ల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేసాడు.
David Warner Breaks Chris Gayle Record : ఆస్ట్రేలియా వెటరన్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ తాజాగా ఓ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఒమన్‌తో గురువారం (జూన్ 6) జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో (51 బంతుల్లో 56; 6 ఫోర్లు, సిక్సర్) అదరగొట్టిన వార్నర్.. టీ20ల్లో అత్యధిక 50+ ప్లస్ స్కోర్ల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేసాడు.
ఒమన్‌పై హాఫ్ సెంచరీ కలుపుకుని వార్నర్ ఖాతాలో 111 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు ఉండగా.. క్రిస్ గేల్ పేరిట 110 50+ ప్లస్ స్కోర్లు నమోదై ఉన్నాయి. అయితే వార్నర్ కేవలం 378 ఇన్నింగ్స్‌ల్లో 111 50+ ప్లస్ స్కోర్ల మార్కు అందుకోగా.. గేల్‌కు 110 50+ప్లస్ స్కోర్లు చేసేందుకు 455 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఇక రానున్న రోజుల్లో జరిగే T 20 మ్యాచుల్లో డేవిడ్ వార్నర్ ఇంకెలాంటి రికార్దులు సృష్టిస్తాడో చూడాలి.
ట్రంప్ టారీఫ్ ల దెబ్బతో కుదేలైపోయిన స్టాక్ మార్కెట్ ఈరోజు కాస్త కోలుకుంది. ఉదయం మార్కెట్ ప్రారంభ సమయం నుంచే లాభాల బాటలో పయనిస్తోంది. సెన్సెక్స్ 1100 పాయింట్లు, నిఫ్టీ 400 పాయింట్లు పెరిగి 22,550 స్థాయిలో ట్రేడవుతున్నాయి.
స్టాక్ మార్కెట్లో ఇంతలా డైనమిక్ ఛేంజ్ లు ఇంతకు ముందు ఎప్పుడూ చూసి ఉండరేమో. నిన్న మార్కెట్లు అధ:పాతాళానికి వెళ్ళి కోట్ల రూపాయలు కరిగిపోయాయి. భారత స్టాక్ మార్కెట్ ఈ ఏడాదిలో రెండవ అతిపెద్ద పతనాన్ని చూసింది. సెన్సెక్స్ 2226 పాయింట్లు (2.95%) పడిపోయి 73,137 వద్ద ముగిసింది. నిఫ్టీ 742 పాయింట్లు (3.24%) పడిపోయి 22,161 వద్ద ముగిసింది. అంతకుముందు జూన్ 4వ తేదీ 2024లో మార్కెట్ 5.74% పడిపోయింది. మరోవైపు ప్రపంచ మార్కెట్ పరిస్థితి కూడా అలానే ఉంది.
కానీ ఈరోజు ఉదయానికి పరిస్థితి అంతా మారిపోయింది. నష్టాల్లో ఉన్న సూచీలు ఈరోజు మార్కెట్ ప్రారంభం నుంచే లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 1100 (1.60%) పాయింట్లకు పైగా లాభంతో 74,300 స్థాయిలో ట్రేడవుతోంది. అదే సమయంలో, నిఫ్టీ కూడా దాదాపు 400 (1.70%) పాయింట్లు పెరిగి 22,550 స్థాయిలో ట్రేడవుతోంది. సెన్సెక్స్‌లోని అన్ని స్టాక్స్ అంటే 30 స్టాక్స్ లాభాల్లో పయనిస్తున్నాయి. ముఖ్యంగా మెటల్, ఆటో షేర్లు బాగా లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్లలో పెరుగుదల వల్లనే భారతీయ మార్కెట్ లాభాలు చూస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఆసియా మార్కెట్లలో.. జపాన్ నిక్కీ ఇండెక్స్ దాదాపు 6% పెరిగింది. అలాగే హాంకాంగ్ ఇండెక్స్ కూడా 2% పెరిగింది. వీటితో పాటూ NSE అంతర్జాతీయ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడవుతున్న నిఫ్టీ కూడా 1.5% పెరిగింది. ఇది మార్కెట్లో అప్‌ట్రెండ్‌ను సూచిస్తుంది. అలాగే నిఫ్టీ 50, సెన్సెక్స్ చార్టులు ఓవర్‌సోల్డ్ RSI స్థాయిలను చూపుతున్నాయి. ఇది షార్ట్-కవరింగ్ , కొత్త కొనుగోళ్లకు దారితీస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.