Suhani Bhatnagar: 19 ఏళ్లకే 'దంగల్' నటి సహానీ కన్నుమూత

అమీర్ ఖాన్ దంగల్ సినిమాలో బబిత పాత్ర పోషించిన సహానీ భట్నాగర్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సహానీ ఈరోజు మరణించినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.19 ఏళ్లకే సహానీ కన్నుమూయడం అందరికీ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

New Update
Suhani Bhatnagar: 19 ఏళ్లకే  'దంగల్' నటి సహానీ కన్నుమూత

Suhani Bhatnagar: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ చిన్న కూతురిగా.. బబిత పాత్ర పోషించిన సహానీ భట్నాగర్ కన్నుమూశారు. 19 ఏళ్ల వయసులోనే సహానీ మృతి చెందడం కుటుంబ సభ్యులు, ఆమె అభిమానులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈమె మరణానికి కారణం శరీరం మొత్తం నీరు పట్టడం అని అంటున్నారు. అయితే కొంత కాలం క్రితం సహానీ యాక్సిడెంట్ కు గురైంది. ఈ ప్రమాదంలో ఆమె కాలు ఫ్రాక్చర్ అయ్యింది. ఈ ట్రీట్మెంట్ సమయంలో తీసుకున్న మందుల కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని.. దాంతో శరీరంలో నీరు పేరుకుపోవడం మొదలైనట్లు తెలుస్తోంది. చాలా కాలంగా ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న.. సహానీ ఈరోజు అంటే ఫిబ్రవరి 17 న మరణించినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

Also Read : Rashmika Mandanna: అరుదైన ఘనత సాధించిన రష్మిక.. ‘ఫోర్బ్స్ అండర్ 30’ లో చోటు

publive-image

దంగల్ సినిమాతో సహానీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రంలో ఈమె నటనకు ఎన్నో ప్రశంశలు దక్కాయి. దంగల్ తర్వాత సుహానికి చాలా సినిమా ఆఫర్స్ క్యూ కట్టాయి. కానీ ముందు చదువు పూర్తి చేయాలని నిర్ణయించుకున్న ఈమె.. సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది. చదువు తర్వాత మళ్ళీ సినిమాలు చేస్తానని పలు ఇంటర్వూస్ లో తెలిపింది సహానీ.

Also Read: Allu Arjun: బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అల్లు అర్జున్ కు ఆహ్వానం.. ‘పుష్ప’ స్పెషల్ స్క్రీనింగ్

Advertisment
Advertisment
తాజా కథనాలు