Earn money: రోజూ 2 గంటలే ఉద్యోగం చేస్తూ.. లక్షలు సంపాదిస్తున్న యువతి!

9 టు 5 జాబ్ అందరూ చేస్తారు. ఆ యువతి.. తన కెరీర్ భిన్నంగా ఉండాలి అనుకుంది. అందుకో తెలివైన ప్లాన్ వేసింది. 5 నెలలు కష్టపడింది. ఇప్పుడు లక్షలు సంపాదిస్తోంది. ఎలాగో తెలుసుకుందాం.

New Update
Earn money: రోజూ 2 గంటలే ఉద్యోగం చేస్తూ.. లక్షలు సంపాదిస్తున్న యువతి!

ప్రతి రోజూ రెండు గంటలు మాత్రమే ఉద్యోగం చేసి, లక్షల రూపాయలు సంపాదిస్తూ.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ఎం వాల్‌కోట్ అనే యువతి. కేవలం 5 నెలలు ఉద్యోగం చేసి..ఆమె లక్షలు సంపాదించింది. మనీ కోసం రోజూ 2 గంటలు మాత్రమే పనిచేస్తోంది. ఆ తర్వాత రోజంతా ఖాళీగానే ఉంటోంది. అయినా లక్షలు సంపాదిస్తోంది. తాను ఏం చేస్తున్నదీ ఆమె టిక్ టాక్‌లో వివరాలు తెలిసింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

వాల్‌కోట్ అఫిలియేట్ మార్కెట్ నచ్చింది. ఇది ఎలాంటిదంటే.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి సైట్లు అమ్మే ప్రొడక్టుల లింకులను ఇంటర్నెట్‌లో షేర్ చేస్తారు. ఎవరైనా ఆ లింకులు క్లిక్ చేసి.. వస్తువులు కొంటే.. అందులో కొంత కమిషన్.. లింకులు పోస్ట్ చేసిన వారికి దక్కుతుంది. ఇలా ఈ అఫిలియేట్ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఇండియాలో వారు వేసిన లింక్‌ని అమెరికాలో కస్టమర్ క్లిక్ చేసి, వస్తువు కొంటే.. ఇండియాలో లింక్ వేసిన వారికి కమిషన్ వస్తుంది. అంటే.. రూపాయి పెట్టుబడి లేకుండా.. సంపాదించే మార్గం ఇది. ఇలాంటిది చేపట్టేవారు.. ఆయా వెబ్‌సైట్లలో ఉచితంగా అఫిలియేషన్ అకౌంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అకౌంట్‌లో లాగిన్ అయ్యాక.. అక్కడ లింకులు ఉంటాయి. వాటిని ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు వెబ్‌సైట్లలో పోస్ట్ చేస్తుంటారు.

అఫిలియేషన్ లింక్స్ ద్వారా వచ్చే కమిషన్ తక్కువగానే ఉంటుంది. కానీ.. ఎక్కువ లింకులు పోస్ట్ చెయ్యడం ద్వారా.. ఎక్కువ మంది వస్తువులు కొనడం ద్వారా మంచి రాబడి వస్తుంది. ఈ యువతి కూడా అదే చేసింది. దాదాపు 5 నెలలపాటూ… ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైట్లలో లింకులు పోస్ట్ చేసింది. దాంతో.. ఎక్కడ చూసినా ఆమె లింకులే. ఫలితంగా ఇప్పుడు ఆమెకు రోజూ వేల కొద్దీ మనీ వస్తోంది. ఇలా నెల నెలా లక్షలు సంపాదిస్తోంది. ఈ కారణంగానే ఇప్పుడు ఆమె రోజూ 2 గంటలే పనిచేస్తోంది. ఇలా లింకులు పెరిగే కొద్దీ, నానాటికీ ఆమె సంపాదన పెరుగుతోంది.

మీరు కూడా ఇలాంటిది చెయ్యాలనుకుంటే ప్రయత్నించవచ్చు. అయితే.. ఇదేమంత తేలిక కాదు. ఇండియాలో ఇప్పటికే చాలా మంది అఫిలియేషన్ మార్కెట్‌లో తమ ముద్ర వేసుకున్నారు. వారు వేసిన లింక్స్ ఇప్పుడు చాలా సైట్లలో ఉన్నాయి. అందువల్ల కొత్తగా ఈ మార్కెట్‌లోకి ప్రవేశించేవారు.. తమ ముద్ర వెయ్యడానికి చాలా టైమ్ పట్టే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

కొండెక్కుతున్న బంగారం ధరలు.. హైదరాబాద్‌లో ధరలు ఎలా ఉన్నాయంటే?

చైనా-అమెరికా మధ్య టారిఫ్ యుద్ధాల వల్ల బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.95, 410 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 95, 410 ఉంది.

New Update
gold

gold

బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ట్రంప్ టారిఫ్‌ల వల్ల ఒక్క రోజే మూడు వేలు తగ్గిన బంగారం నేడు భారీగా పెరిగింది. చైనా-అమెరికా మధ్య టారిఫ్ యుద్ధాల వల్ల బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.95, 410 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 95, 410 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87, 460గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.

ఇది కూడా చూడండి: Hyderabad Mandi Biryani: హైదరాబాద్‌ వాసులకు 'ఫ్రీ మండి' బిర్యానీ.. ఎలాంటి షరతులూ లేవు..

24 క్యారెట్ల బంగారం ధర

హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.95, 410
విజయవాడలో 10 గ్రాముల ధర రూ.95, 410
ఢిల్లీలో10 గ్రాముల ధర రూ.95, 560
ముంబైలో 10 గ్రాముల ధర రూ.95, 410
కోల్‌కతాలో 10 గ్రాముల ధర రూ.95,410
చెన్నైలో 10 గ్రాముల ధర రూ.95,410
బెంగళూరులో 10 గ్రాముల  రూ.95,410
పుణెలో 10 గ్రాముల ధర రూ.95,410
అహ్మదాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.95,410
విశాఖపట్నంలో 10 గ్రాముల ధర రూ.95,410

ఇది కూడా చూడండి: Brain Health: ఈ అలవాట్లు వెంటనే మానెయ్ లేదంటే బ్రెయిన్ షెడ్డుకే..!

22 క్యారెట్ల బంగారం ధర

హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.87,460
విజయవాడలో 10 గ్రాముల ధర రూ.87,460
ఢిల్లీలో10 గ్రాముల ధర రూ.87,610
ముంబైలో 10 గ్రాముల ధర రూ.87,460
కోల్‌కతాలో 10 గ్రాముల రూ.87,510
చెన్నైలో 10 గ్రాముల ధర రూ.87,460
పుణెలో 10 గ్రాముల ధర రూ.87,460
బెంగళూరులో 10 గ్రాముల ధర రూ.87,460

ఇది కూడా చూడండి: China: మీరు పెంచితే మేము పెంచమా అంటున్న చైనా..125 శాతం సుంకం పెంపు

 

Advertisment
Advertisment
Advertisment