Andhra Pradesh: రేపు చంద్రబాబుతో పురంధేశ్వరి ములాఖత్.. తోడుగా భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా..!

చంద్రబాబు అరెస్ట్‌పై ఇంతకాలం స్తబ్ధుగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి.. ఇప్పుడిప్పుడే ఆయన అరెస్ట్‌పై స్పందిస్తున్నారు. రాజమండ్రికి వెళ్లి.. అక్కడ చంద్రబాబుతో ములాఖత్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. శుక్రవారం నాడు నారా భువనేశ్వరి, బ్రాహ్మణనితో కలిసి.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ అవుతారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

New Update
Andhra Pradesh: రేపు చంద్రబాబుతో పురంధేశ్వరి ములాఖత్.. తోడుగా భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా..!

Daggubati Purandeshwari: చంద్రబాబు అరెస్ట్‌పై ఇంతకాలం స్తబ్ధుగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి.. ఇప్పుడిప్పుడే ఆయన అరెస్ట్‌పై స్పందిస్తున్నారు. శుక్రవారం నాడు ఏకంగా రాజమండ్రికి వెళ్లి.. అక్కడ చంద్రబాబుతో ములాఖత్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. శుక్రవారం నాడు నారా భువనేశ్వరి, బ్రాహ్మణని కలిసి.. ఆ తరువాత ముగ్గురూ కలిసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖత్ అవుతారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరింత ఇది ఎంత వరకు నిజమో గానీ.. ఈ వార్త ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం సృష్టితోంది.

ఇప్పటికే బుధవారం నాడు లోకేష్‌తో పాటు అమిత్ షా ను కలవడంపై పురంధేశ్వరిపై వైసీపీ నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ భేటీపై ఏపీలోనే కాకుండా.. తెలంగాణలోనూ రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పరంగా అనేక సందేహాలు తెరపైకి వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో పురంధేశ్వరి శుక్రవారం నాడు అంటే రేపు రాజమండ్రి వెళ్లి చంద్రబాబును ములాఖత్ అయితే ఈ ప్రశ్నలకు, ఈ ఊహాగానాలకు కొంచెం క్లారిటీ ఇచ్చినట్లే అవుతుందని పొలిటికల్ పండితులు అభిప్రాయపడుతున్నారు.

ఇక అమిత్ షాతో భేటీలో ఎలాంటి రాజకీయ పరమైన అంశాలను ప్రస్తావనకు రాలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు.. చంద్రబాబు అరెస్ట్‌లో బీజేపీ ప్రమేయం ఉందంటూ వస్తున్న వార్తలకు ఈ భేటీ చెక్ పడినట్లయ్యిందని పురంధేశ్వరి చెప్పుకొస్తున్నారు. ఇలా ఎవరి వెర్షన్ వారు చెబుతుండగా.. పొలిటిలక్ సర్కిల్‌లో మాత్రం రకరకాల ప్రచారాలు సర్క్యూలేట్ అవుతున్నాయి. మరి శుక్రవారం ఏం జరుగుతుందో తెలియాలంటే ఎదురు చూడాల్సిందే.

Also Read:

స్టేడియంలోనే తన్నుకున్న క్రికెట్‌ ఫ్యాన్స్‌.. ఇండియా,అఫ్ఘాన్‌ మ్యాచ్‌ సమయంలో ఏం జరిగిందంటే?

 శ్రీనివాస్ గౌడ్ ఏ కార్డు ప్లే చేసినా.. ఓడిస్తా: యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ

Advertisment
Advertisment
తాజా కథనాలు