AP: కడపలో డాడీ హోమ్ వివాదం.. బయటకు పోండి.. మీ డాడీకి పట్టిన గతే మీకు పడుతుందని న్యాయవాది వార్నింగ్..!

కడపలో మరోమారు డాడీ హోమ్ వివాదం తెరపైకి వచ్చింది. రాజా ఫౌండేషన్ మాజీ చైర్మన్ రాధపై ప్రొద్దుటూరుకి చెందిన ప్రముఖ న్యాయవాది చేయి చేసుకున్నాడు. పూజ ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో బూతులు తిడుతూ.. బయటకు పోండి.. లేదంటే మీ డాడీకి పట్టిన గతే మీకు పడుతుందని బెదిరింపులకు దిగాడు.

New Update
AP: కడపలో డాడీ హోమ్ వివాదం.. బయటకు పోండి.. మీ డాడీకి పట్టిన గతే మీకు పడుతుందని న్యాయవాది వార్నింగ్..!

Kadapa: కడపలో మరోమారు డాడీ హోమ్ వివాదం తెరపైకి వచ్చింది. రాజా ఫౌండేషన్ మాజీ చైర్మన్ రాధపై ప్రొద్దుటూరుకి చెందిన ప్రముఖ న్యాయవాది చేయి చేసుకున్నాడు. రాజా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పూజ ఇంటర్నేషనల్ స్కూల్ లో మాజీ చైర్మన్ రాధ, మాజీ సీఈఓ కవితపై దురుసుగా ప్రవర్తించారని.. చిన్నపిల్లలకు కేర్ టేకర్ గా ఉన్న ఆయా అనసూయమ్మపై కూడా న్యాయవాది బూతులు తిట్టాడని ఫౌండేషన్ నిర్వహకులు ఆరోపిస్తున్నారు.

స్కూల్ ఆవరణలో న్యాయవాది బండ బూతులు తిడుతూ.. పెద్ద పెద్దగా అరుస్తూ.. బయటకు పోండి.. లేదంటే మీ డాడీకి పట్టిన గతే మీకు పడుతుందని బెదిరింపులకు దిగాడు. రాదాపై చేయి చేసుకుని ఆఫీస్ రూమ్ నుండి ఆయనను బలవంతంగా బయటకు గేంటేశాడని అక్కడున్న నిర్వహకులు ఆరోపిస్తున్నారు. న్యాయవాదిని ఎదిరించలేక వెంటనే 100కు కాల్ చేశారు డాడీ హోమ్ అబాగ్యులు. జరిగిన సంఘటన వివరించారు. హోమ్ లోని అనాధల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. అయితే, పోలీసులను పలుకుబడితో మేనేజ్ చేస్తాడని అనాధలు భయాందోళన చెందుతున్నారు. ఈ విషయంపై హోమ్ లోని నిర్వహకులు రేపు కలెక్టర్ ను కలవనున్నట్లు తెలుస్తోంది. రాదాను భయపెట్టి న్యాయవాది హోమ్ నిర్వహణ బాధ్యతలను తీసుకున్నారు.

ఎంతో మంది అనాధలకు డాడీ హోమ్ లో ఆశ్రయం కల్పించిన ఫౌండర్ రాజారెడ్డి. అనాధలకే నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తూ ఆ మేరకు రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. కలెక్టర్ సంరక్షణలో నిర్వహణ చేపట్టేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే రాజారెడ్డి హత్యకు గురయ్యారు. ఫౌండేషన్ వ్యవస్థపకుడు రాజరెడ్డి హత్య అనంతరం అతని పిల్లల్ని మోసం చేసి ఆ ట్రస్ట్ ను న్యాయవాది రాపించుకున్నా రని తెలుస్తోంది. రాజా ఫౌండేషన్ ఆస్తుల కోసం అనాధ పిల్లలపై కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెరపైకి చిన్న జియర్ స్వామి పేరు కూడా వెలుగులోకి వచ్చింది. ట్రస్ట్ ను విలీనం చేశామని బయటకు వెళ్లాలంటూ ట్రస్ట్ సభ్యులను బెదిరింపులకు గురిచేస్తున్నారని తెలుస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు