Michaung : ముంచుకొస్తున్న మిచౌంగ్..హెచ్చరికలు జారీ చేసిన అధికారులు! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మిచౌంగ్ తుఫాన్ ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రం కృష్ణాజిల్లా మచిలీపట్నం వద్ద ఇది తీరం దాటనున్నట్లు వివరించారు. By Bhavana 02 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ నేషనల్ New Update షేర్ చేయండి High Rain Alert for AP: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఏపీలోని మచిలీపట్నానికి 910 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇది ఆదివారం నాటికి తీవ్ర తుఫాన్ గా మారనుంది. దీనికి మిచౌంగ్ (Cyclone Michaung) అని నామకరణం చేశారు. మచిలీపట్నం సమీపంలోనే తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డితో కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఇప్పటికే జిల్లా, రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశామని తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసినట్లు జవహర్ రెడ్డి వివరించారు. ఈ తుఫాన్ ప్రభావంతో రాగల రెండు మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. తీరం వెంట గంటకు 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రానికి ఈ వాయుగుండం చెన్నై- మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకే అవకాశమున్నట్లు ఐఎండీ అంచనా వేసింది. ఈ సమయంలో జాలర్లు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంతాల్లో తుఫాన్ నష్ట తీవ్రతను తగ్గించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్టీఆర్‌ఎఫ్ బలగాలు మోహరించాయి. తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉండే జిల్లాల్లో పౌర సరఫరాల విభాగం ద్వారా నిత్యావసర సరుకులు కూడా అందించేలా చర్యలు చేపట్టింది. అంతే కాకుండా ప్రభుత్వ రంగ అధికారులను కూడా ముందుగా ఏర్పాటు చేసింది. జిల్లా అధికారులతో పాటు విద్యుత్, టెలికాం, మున్సిపల్, వైద్య ఆరోగ్య తదితర శాఖల అధికారులను కూడా అలర్ట్ గా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. Also read: భయంగా ఉంది..ధైర్యమిస్తారా అని అడుగుతున్న ముద్దుగుమ్మ! #chennai #imd #rain-alert-for-ap #cyclone-michaung #michaung మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి