Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ సైకిల్ యాత్ర

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా.. ఆయనను వెంటనే విడుదల చేయాలని కోరుతూ టీడీపీ శ్రేణులు చేపట్టిన సైకిల్ యాత్ర13వ రోజుకు చేరుకుంది. ఎమ్మెల్యే గొట్టిపాటి ఆధ్వర్యంలో ఈ యాత్ర నిర్వహిస్తున్నారు.

New Update
Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ సైకిల్ యాత్ర

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా.. ఆయనను వెంటనే విడుదల చేయాలని కోరుతూ టీడీపీ శ్రేణులు చేపట్టిన సైకిల్ యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. సైకిల్ యాత్ర13వ రోజుకు పంగులూరు మండలంలో కొనసాగింది. బాపట్ల జిల్లా పంగులూరు మండలంలోని కశ్యపురం గ్రామం నుంచి మండలంలోని జనకవరం గ్రామం వరకు సుమారు 10 కిలోమీటర్ల మేరా సైకిల్ యాత్ర సాగింది. సైకిల్ యాత్రలో భాగంగా తొలుత గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులార్పించారు. అనంతరం గ్రామ మహిళలు హారతులు ఇచ్చిన తర్వాత సైకిల్ యాత్ర ప్రారంభమైంది. సైకిల్‌ యాత్ర చేస్తున్న గొట్టిపాటి రవికుమార్ పై గ్రామస్థులు పూల వర్షం కురిపించారు.

కశ్యపురం ఎస్‌సీ కాలనీ నుంచి రేణిగవరం, కొండమూరు, జనకవరం గ్రామాల మీదుగా, సైకిల్ యాత్ర చేరుకుంది. గ్రామ గ్రామాన గొట్టిపాటి సైకిల్ యాత్రకు మహిళలు బ్రహ్మరథం పట్టారు. గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. గత పది రోజుల నుంచి చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా సైకిల్ యాత్ర చేస్తున్నామన్నారు. మన నాయకుడి కోసం మనం ఎంత దూరమైనా వెళ్ళేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన ప్రజలకు తెలిపారు. ఈ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొరత ఎక్కువగా ఉందని ఎమ్మెల్యే మండిపడ్డారు.

రైతులు రోడ్డు మీద పడవాల్సిన పరిస్థితి

పంటలు ఎండిపోతున్నా అధికారులు, ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. దీంతో రైతులు రోడ్డు మీద పడవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విద్యుత్ సాగు అవసరాలకు సరిపడినంత సరఫరా చేశామని ఎమ్మెల్యే గుర్తు చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరున విదేశీ విద్యా అవకాశాలను కల్పించామన్నారు. ఈ ప్రభుత్వంలో రాజ్యాంగ నిర్మాత పేరును తొలగించి తన పేరు పెట్టుకుని కనీసం ఒకరికి కూడా విదేశీ విద్యా అవకాశాలు కల్పించలేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: పచ్చని పొలాల మధ్య బైక్ సంచారం.. అసలేం జరిగిందంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు