Hyderabad Police : మందుబాబులకు హైదరాబాద్ పోలీసుల షాక్.. ఆ రోజున మద్యం షాపులు బంద్! హోలీ పండుగ సందర్భంగా మందుబాబులకు షాకిచ్చారు హైదరాబాద్ పోలీసులు. మార్చి 25వ తేదీ ఉదయం 6గంటల నుంచి 26వ తేదీ ఉదయం 6గంటల వరకు మద్యం షాపులను మూసివేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంతి తెలిపారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. By Bhoomi 22 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Hyderabad Police : హోలీ పండగ సందర్భంగా హైదరాబాద్ లో ఆంక్షలు విధించారు నగర పోలీసులు. మార్చి 25న ఉదయం 6గంటల నుంచి 26వ తేదీ ఉదయం 6గంటల వరకు మద్యం షాపులు మూసివేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంతి తెలుపుతూ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. హోలీ పండుగ వేడుకల్లో పాల్గొనే వారు ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సిటీలో తిరిగే వాహనదారులపై రంగులు చల్లకూడదని సీపీ తెలిపారు. వాహనాలపై పబ్లిక్ రోడ్స్ లో గుంపులుగా తిరుగుతూ న్యూసెన్స్ చేయోద్దని సీపీ సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలుగకుండా పండుగ సందర్భంగా షాపులు మూసివేయాలని వైన్స్ నిర్వాహకులకు ఆదేశాలను జారీ చేసినట్లు చెప్పారు. మందు తాగి బహిరంగ ప్రదేశాల్లో గొడవలకు దిగుతే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హోలీ సందర్భంగా ప్రతిఏటా సిటీలో వైన్స్ షాపులు తెరిచేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం తెలిసిందే. మద్యం షాపులను మూసివేయాల్సిందిగా పోలీసులు యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు పోలీసులు. ఇది కూడా చదవండి : ఎవరు ఎలాంటి వారో ఈరోజే తెలిసింది.. ఉండవల్లి శ్రీదేవి ఎమోషనల్ ట్వీట్ #holi #cyberabad #hyderabad-police #wines మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి