Lucknow: భర్త కోతి అని పిలిచాడని ఉరేసుకొని భార్య ఆత్మహ**త్య!

లక్నోలో భర్త రాహుల్ తన భార్యను ‘బందరియా’(కోతి) అని పిలవడంతో భార్య తను సింగ్ తీవ్ర మనస్థాపానికి గురై గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.

New Update
Lucknow

Lucknow

Lucknow: లక్నో ఇంద్రానగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త రాహుల్ శ్రీవాస్తవ్ తన భార్య తను సింగ్ ని మామూలుగా ‘బందరియా’(కోతి) అని పిలవడంతో తను తీవ్ర మనస్థాపానికి గురై తన గదిలోకి వెళ్ళి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

ఘటన వివరాలు (Lucknow Wife and Husband Crime)

తను సాదత్ గంజ్ లో నివసించేది. నాలుగేళ్ల క్రితం రాహుల్‌తో ప్రేమ వివాహం చేసుకుంది. మోడలింగ్ అంటే ఆమెకు చాలా ఇష్టం. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, బుధవారం సాయంత్రం సీతాపూర్ నుండి ఇంటికి తిరిగి వచ్చి అందరూ కలిసి మాట్లాడుకుంటూ, జోక్స్ వేసుకుంటూ  గడిపారు. ఆ సమయంలో రాహుల్ తన భార్యను ‘బందరియా’ అని మామూలుగా పిలిచాడు. తను ఆ మాట వల్ల కోప్పడి గదిలోకి వెళ్ళింది.

కొంతసేపటి తర్వాత, భోజనానికి పిలిచినా తను స్పందించలేదు. రాహుల్ విండో నుంచి చూడగా తను గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని కనిపించింది. వెంటనే ఆమెను రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించగా, డాక్టర్లు ఆమె మృతదేహాన్ని నిర్ధారించారు.

తను అక్క అంజలి తెలిపిన వివరాల ప్రకారం, తను మోడలింగ్‌లో చాలా ఆసక్తి కనబరుస్తుంది. చిన్న మాటల వల్ల తను సున్నితంగా బాధపడేది. భర్త అన్న మాట వల్ల ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది. అని తెలిపారు.

పోలీసులు కేసును పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం తర్వాత కుటుంబానికి అప్పగించారు. ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదు.

Advertisment
తాజా కథనాలు