Eluru : ఏలూరు జిల్లాలో దారుణం.. హాస్టల్ విద్యార్థునులపై అత్యాచారం!

AP: ఏలూరు జిల్లా స్వామి దయానంద సరస్వతి హాస్టల్‌లో విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కీచకుడు. అందులో పనిచేసే వార్డెన్ భర్త శశికుమార్ విద్యార్థినులను టార్గెట్ చేస్తూ అత్యాచారాలు చేస్తున్నాడు.

author-image
By V.J Reddy
New Update
eluru

Eluru Rape: ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. స్వామి దయానంద సరస్వతి హాస్టల్ లో బాలికపై అత్యాచారం జరిగింది. స్టూడెంట్స్‌ ను వార్డెన్‌ భర్త శశికుమార్ ట్రాప్ చేశాడు. విద్యార్థినులకు మాయమాటలు చెప్పి వల వేసుకున్నాడు. ఇటీవల ఓ స్డూడెంట్‌ను బాపట్లకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. హాస్టల్‌కు వచ్చిన తర్వాత పేరెంట్స్‌కు ఈ విషయాన్నీ ఆ స్టూడెండ్ చెప్పడంతో ఈ కీచకుడు చేసిన దారుణ విషయాలు బయటకు వచ్చాయి.

శశికుమార్‌పై ఏలూరు 2 టౌన్‌లో బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా.. ఈ విచారణలు పోలీసులకు కళ్లు తిరిగే విషయాలు తెలిశాయి. భర్తకు సహకరించాలని విద్యార్థినులపై వార్డెన్‌ ఫణిశ్రీ ఒత్తిడి చేసినట్లు బాధితులు పోలీసులకు తెలిపారు. శశికుమార్‌కు సహకరించకపోతే టార్చర్‌ పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత తల్లిదండ్రులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. భర్తతో పాటు భార్య హాస్టల్ వార్డెన్ పై కేసు నమోదు చేయాలని కోరారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Crime News: నాశనమైపోతార్రా.. 5 ఏళ్ల చిన్నారిని చంపి.. తల్లిపై మైనర్లు రేప్

హర్యానాలోని జింద్‌లో దారుణం జరిగింది. ముగ్గురు పిల్లలతో కలిసి నిద్రపోతున్న బాధితురాలిపై నలుగురు దుండగులు దాడి చేశారు. అందులో 5ఏళ్ల చిన్నారిని చంపి చెత్తకుండీలో పడేశారు. ఆపై బాధితురాలిపై అత్యాచారం చేశారు. ఆమె స్పృహ కోల్పోవడంతో అక్కడ నుంచి పరారయ్యారు.

New Update
Rape and murder Haryana

Rape and murder Haryana

కామాంధుల ఆగడాలు పెరిగిపోయాయి. ఆడది కనిపిస్తే చెలరేగిపోతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా క్రూర మృగాళ్లా ప్రవర్తిస్తున్నారు. తాజాగా అలాంటిదే ఓ దారుణం జరిగింది. ఇంట్లో తన ముగ్గురు బిడ్డలతో నిద్రిస్తున్న ఓ మహిళపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అదే సమయంలో 5 ఏళ్ల చిన్నారిని హత్య చేశారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిలో ముగ్గురు మైనర్లు ఉండటం సంచలనం సృష్టించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

5 ఏళ్ల చిన్నారిని చంపి

ఈ ఘటన హర్యానాలోని జీంద్‌లో జరిగింది. మంగళవారం రాత్రి ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో గుడిసెలో నిద్రిస్తుంది. దీంతో ఆమె భర్త లేడని తెలుసుకున్న నలుగురు దుండగులు ఆ గుడిసెలోకి వెళ్లారు. అనంతరం పిల్లలతో కలిసి నిద్రిస్తున్న బాధితురాలిపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

అదే సమయంలో ఆ బాధితురాలితో పాటు 5 ఏళ్ల చిన్నారిని పక్కనే ఉన్న చెత్తకుప్ప వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఆ చిన్నారి గొంతు నులిమి హత్య చేశారు. ఆపై బాధితురాలి పై దుండగులు నలుగురూ అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యారు. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

ఇక గొంతునులిమి హత్య చేసిన చిన్నారి.. డెడ్ బాడీ రాత్రంతా చెత్తకుప్పలోనే ఉంది. ఇక గురువారం ఆ బాధితురాలు స్పృహలోకి వచ్చి.. జరిగిన దారుణాన్ని పోలీసులకు తెలిపింది. ఈ ఘటనపై ఎస్‌ఐ. యశ్‌వీర్ మాట్లాడుతూ.. ఇందులో నిందితుడు అమిత్‌ అనే వ్యక్తితో సహా మరో ముగ్గురు మైనర్లు ఉన్నారని వెల్లడించారు. 

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

telugu-news | crime news | Minor Girl Rape | latest-telugu-news | girl raped and murdered

Advertisment
Advertisment
Advertisment