Breaking: ఆగని బాంబు బెదిరింపులు.. విజయవాడలోని ఓ హోటల్‌కు.. విజయవాడలోని ఓ హోటల్‌కి కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. బందరు రోడ్డులో ఉన్న వివంతా హోటల్‌కి గుర్తు తెలియని దుండగులు మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులకు పాల్పడ్డారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఆ హోటల్‌లో తనిఖీ చేపట్టారు. By Kusuma 28 Oct 2024 in క్రైం విజయవాడ New Update షేర్ చేయండి ఈ మధ్యకాలంలో వరుస బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తాయి. మొన్నటి వరకు విమానయాన సంస్థలకు వచ్చిన బాంబు బెదిరింపులు ఇప్పటికి హోటల్స్‌కు వస్తున్నాయి. నిన్న తిరుపతిలోని ఓ హోటల్‌కి బాంబు బెదిరింపులు రాగా.. ఇటీవల విజయవాడలోని ఓ హోటల్‌కి కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇది కూడా చూడండి: ముంబైలో వరుస తొక్కిసలాటలు.. ఒకేసారి 22 మంది మృతి! ఫేక్ మెయిల్ బెదిరింపులు.. బందరు రోడ్డులో ఉన్న వివంతా హోటల్‌కి గుర్తు తెలియని దుండగులు మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులకు పాల్పడ్డారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఆ హోటల్‌లో తనిఖీ చేపట్టారు. కానీ ఎలాంటి అనుమానస్పద వస్తువులు లభించలేదు. ఇది ఒక ఫేక్ మెయిల్ అని, ఫేక్‌గా బాంబు బెదిరింపులు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇది కూడా చూడండి: జగన్, షర్మిల ఆస్తుల వివాదం..మధ్యలో పవన్ ఎంట్రీ? వారి ఛాప్టెర్ క్లోజ్! ఇదిలా ఉంటే నిన్న తిరుపతిలోని హోటల్స్‌కు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఉగ్రవాద సంస్థలు మెయిల్స్ పంపినట్లు పోలీసులు తెలిపారు. జాఫర్ సాదిక్ పేరుతో మెయిల్స్ వచ్చినట్లు చెప్పారు. బాంబ్ బెదిరింపు మెయిల్స్ వచ్చిన హోటల్స్ లో పోలీసులు, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. అలాగే తిరుపతి కేటీ రోడ్డులోని ఆలయానికి కూడా బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినట్లు సమాచారం. ఇది కూడా చూడండి: Telangana: తెలంగాణలో 10 మంది ఎస్పీలు డిస్మిస్...! తిరుపతిలోని లీలామహల్ సెంటర్‌లోని మూడు హోటల్స్‌కు, రామానుజ కూడలిలోని మరో హోటల్‌కు ఫేక్ బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అలాగే కపిల తీర్థం దగ్గర్లోని రాజ్‌పార్క్ హోటల్‌ను పేల్చేస్తామంటూ మెయిల్ ద్వారా బెదిరింపులు పంపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు హోటల్లో తనికీ చేయగా ఎక్కడా పేలుడు పదార్థాలు దొరకలేదు. దీంతో పోలీసులతో పాటు శ్రీవారి భక్తులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇది కూడా చూడండి: Tirumala: తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..ఎప్పుడంటే! #bomb-threats మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి