Chhattisgarh: 17 ఏళ్ళ బాలికపై అత్యాచారం..నలుగురు ఉపాధ్యాయులు అరెస్ట్

ఆడది అయితే చాలు వావి వరుసలు మరిచిపోతున్నారు. తండ్రి దగ్గర నుంచీ ఉపాధ్యాయుల వరకూ అందరూ అమ్మాయి జీవితాలతో ఆడుకుంటున్నారు. రీసెంట్‌గా 17 ఏళ్ళ బాలిక మీద అత్యాచారం చేసిన నలుగురు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

New Update
Kurnool : సమాజం సిగ్గుపడే ఘటన.. సొంత చెల్లికే ప్రెగ్నెంట్ చేసిన కామాంధుడు!

మహేంద్రఘడ్‌లో జరిగిన ఘనపై పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం కేసులో ముగ్గురు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులతో పాటు మొత్తం నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నవంబర్‌ 15, 22 తేదీల్లో జనక్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలికపై రెండు సార్లు ఈ టీచర్లు రేప్ చేశారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని మీద కేసు నమోదు చేసిన పోలీసులు...దర్యాప్తు తర్వాత నిందితులను ఈరోజు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో దేవ్‌గఢ్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు అశోక్‌ కుమార్‌ కుష్వాహా, కుశాల్‌ సింగ్‌, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవేంద్ర సింగ్‌ కుష్వాహా, అటవీశాఖ ఉద్యోగి బన్వరి సింగ్‌ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

ప్లాన్ ప్రకారం..

బాధితురాలు మహేంద్రగఢ్‌ లోని.. భరత్‌పుర్‌ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో 11వ తరగతి చదువుతోంది. బాలికల పాఠశాలలో చదువుతున్న ఈమెను...చదువులో సాయం చేస్తానని నమ్మించిన రవేంద్ర అనే టీచర్ నవంబర్ 15న తన కారులో ఎక్కించుకుని కుశాల్ అనే మరో టీచర్ ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అయితే రవేంద్ర మరో ఇద్దరు ఉపాధ్యాయులు ఆమె విషయంలో ముందే ప్లాన్ వేసుకున్నారు. దాని ప్రకారం అశోక్ అనే వ్యక్తి అప్పటికే కుశాల్ ఇంటికి చేరుకున్నాడు. అక్కడ ఈ ముగ్గురూ కలిసి బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. దాని తరువాత నిందితులు ఈ ఘటనను తమ మొబైల్‌ ఫోన్లలో రికార్డు చేసి.. ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియోలను సర్క్యులేట్‌ చేస్తామని బెదిరించారు. ఆ తర్వాత నవంబర్‌ 22న నిందితులు బాలికను మరోసారి  బ్లాక్‌మెయిల్‌ చేసి బన్వారి ఉంటున్న నివాసానికి తీసుకెళ్లి అక్కడ అత్యాచారానికి పాల్పడ్డారు. తనపై జరిగిన దురాగతాన్ని బాలిక ధైర్యంగా తన తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులను ఆశ్రయించారు. ఈ నలుగురు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు ఉపాధ్యాయుల్ని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారని తెలిపారు. 

Also Read: RGV: నేను భయపడే రకం కాదు–ఆర్జీవీ

Advertisment
Advertisment
తాజా కథనాలు