ఫుల్లుగా తాగి సముద్రంలో పడి చనిపోయిన సింగర్.. సింగపూర్‌ కోర్టు సంచలనం

ఇండియన్ సింగర్ జుబీన్ గార్గ్ మృతిపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఆయన మరణంలో ఎలాంటి కుట్ర లేదని, అది యాక్సిడెంటల్ డెత్ అని సింగపూర్ కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. జుబీన్ గార్గ్ హత్యకు గురయ్యారనడానికి ఎటువంటి ఆధారాలు లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది.

New Update
_Zubeen Garg

ఇండియన్ ఫేమస్ సింగర్ జుబీన్ గార్గ్ మృతిపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఆయన మరణంలో ఎలాంటి కుట్ర లేదని, అది కేవలం యాక్సిడెంటల్ డెత్ అని సింగపూర్ కోర్టు బుధవారం కీలక తీర్పు వెల్లడించింది. జుబీన్ గార్గ్ హత్యకు గురయ్యారనడానికి ఎటువంటి ఆధారాలు లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది. భారత్-సింగపూర్ ద్వైపాక్షిక సంబంధాలకు 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఒక మెగా కల్చరల్ ప్రోగ్రాంలో ప్రదర్శన ఇచ్చేందుకు జుబీన్ గార్గ్ సింగపూర్ వెళ్లారు. అయితే, 2025 సెప్టెంబర్ 19న ఓ బోట్‌లో ప్రయాణిస్తుండగా ఆయన సముద్రంలో పడి మునిగిపోయారు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. తన భర్త మరణం వెనుక కుట్ర దాగి ఉందని, అది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అని జుబీన్ భార్య గరిమా సైకియా గార్గ్ అనుమానం వ్యక్తం చేస్తూ కేసు పెట్టారు.

పీసీజీ విచారణలో తేలిన వాస్తవాలు

గరిమా ఫిర్యాదుతో సింగపూర్‌కు చెందిన పోలీస్ కోస్ట్ గార్డ్స్ బృందం ఈ కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేసింది. కోర్టుకు సమర్పించిన నివేదికలో పీసీజీ పలు కీలక అంశాలను వెల్లడించింది. పడవ ఎక్కే ముందే జుబీన్ గార్గ్ అధిక మోతాదులో ఆల్కహాల్ సేవించినట్లు తేలింది. దీనివల్ల ఆయన నిలకడ కోల్పోయి మత్తులో ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. పడవ ఎక్కేటప్పుడు ఆయన లైఫ్ జాకెట్ ధరించినప్పటికీ, మధ్యలో దానిని తీసివేసినట్లు గుర్తించారు. మత్తులో ఆయన అనుకోకుండా పడవలోంచి నీళ్లలోకి జారిపడ్డారని, ఎవరూ ఆయనను తోసేయలేదని పీసీజీ స్పష్టం చేసింది.

స్టేట్ కరోనర్ ఆడమ్ నఖోడా కూడా జుబీన్ మరణంపై స్పష్టత ఇచ్చారు. ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం వల్లే ఆయన మరణించినట్లు ప్రభుత్వ వైద్యులు ధృవీకరించారు. స్విమ్మర్లు ఆయనను రక్షించే ప్రయత్నం చేశారే తప్ప, హాని చేయలేదని కోర్టు అభిప్రాయపడింది. సింగపూర్ ప్రభుత్వం నిర్వహించిన ఈ దర్యాప్తులో ఎక్కడా కుట్ర కోణం కనిపించకపోవడంతో కోర్టు కేసును క్లోజ్ చేసింది. జుబీన్ మరణం నేపథ్యంలో అప్పట్లో ఆ కల్చరల్ ప్రోగ్రాంను నిర్వాహకులు రద్దు చేశారు. ఈ తీర్పుతో జుబీన్ మరణం చుట్టూ ఉన్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి.

Advertisment
తాజా కథనాలు