Accident: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం! మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం సాయంత్రం పోతారం వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులున్నారు. By srinivas 02 Nov 2024 | నవీకరించబడింది పై 02 Nov 2024 20:26 IST in క్రైం మెదక్ New Update షేర్ చేయండి Accident: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం సాయంత్రం రోడ్డుపై వెళ్తున్న ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉండగా.. దారుణానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వడ్ల కుప్పలు ఉండడంతో.. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పోతారం వద్ద రోడ్డుపై స్థానిక రైతులు ధాన్యం ఆరబోశారు. అయితే రోడ్డుపై వడ్ల కుప్పలు ఉండడంతో ఒకవైపు నుంచే వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. దీంతో శనివారం సాయంత్రం అటుగా వెళ్తున్న ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టింది. బైక్‌పై వెళ్తున్న ఆంజనేయులు, ఆయన మరదలు లత, ఆమె ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. #medak road accident మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి