Maharashtra Train Accident: 12 మంది ప్రాణాలు తీసిన పుకారు.. రైలు ప్రమాదానికి ఇదే కారణం

ట్రైన్‌లో వదంతు 12మంది ప్రాణాలు తీసింది. మహారాష్ట్రలోని జల్‌గాల్‌కు 20 కి.మీ దూరంలో రైలు ప్రమాదం జరిగింది. ట్రైన్‌లో మంటలు చెలరేగాయని ప్రయాణీకులు చైన్ లాగి కిందకి దిగి పరుగులు పెట్టారు. అదే టైంలో పక్క ట్రాక్‌పై వెళ్తున్న మరో ట్రైన్ వారిని ఢీకొట్టింది.

New Update
train accident

train accident Photograph: (train accident)

Maharashtra Train Accident: మహారాష్ట్రంలోని జల్‌గావ్‌కు 20 కిలో మీటర్ల దూరంలో బుధవారం రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 12 మంది ప్రయాణికులు చనిపోయారు. లక్నో నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్‌కు వెళ్తున్న పుష్పక్ ఎక్స్‌ప్రెస్ ఎవరో టైన్ లాగారు. ట్రైన్‌లో మంటలు చెలరేగాయని వదంతు మొదలైంది. దీంతో రైల్లో ప్రయాణీకులు ఒక్కసారిగా ప్రాణభయంతో రైలు దిగి పరుగులు పెట్టారు. అదే సమయంతో మరో ట్రాక్ మీదుగా వెళ్లిన బెంగుళూర్ ఎక్స్‌ప్రెస్ వారిని ఢీకొట్టింది. దీంతో 12 మంది అక్కడికక్కడే చనిపోయారు. 

మరో 8 మందికి తీవ్రగాయాలు అయినట్లు ప్రాథమిక విచారణ ద్వారా తెలుస్తోంది. జల్గావ్ జిల్లాలోని పచోరా సమీపంలో జనవరి 22 సాయంత్రం 5గంటలకు ఈ సంఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలించారు. రైల్వే అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను గుర్తిస్తున్నారు.

Read also ;భార్యను చంపి ముక్కులుగా కోసి, కుక్కర్లో ఉడకబెట్టి, చెరువులో పారేసిన భర్త

 
పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక కోచ్‌లో హాట్ యాక్సిల్ ( రైలు వీల్స్ సెక్షన్)లో బ్రేక్-బైండింగ్ కారణంగా చిన్నపాటి నిప్పు రవ్వలు, పొగ వచ్చిందట. వాటిని చూసిన కొంతమంది ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ట్రైన్ ఎమెర్జెన్సీ స్టాప్ చైన్ లాగారు. మంటలు మంటలు అనుకుంటూ కొందరు ప్యాసింజర్లు క్రిందికి దూకారు. భారీ అగ్ని ప్రమాదం అనుకొని కోచ్ లో ఉన్న అందరూ ప్రయాణికులు, పక్క భోగీ వారు కూడా ట్రైన్ నుంచి కిందికి దూకేశారు. అదే సమయంలో కర్నాటక ఎక్స్‌ప్రెస్‌ పక్కనే ఉన్న ట్రాక్‌పై ప్రయాణిస్తోంది. ఇలా ఈ ఘోరం జరిగిందని రైల్వే సీనియర్‌ అధికారి వివరించారు.

Also Read: ఐటీ రైడ్స్‌పై స్పందించిన దిల్‌రాజు.. ఏమన్నారంటే..?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు