బయలుదేరిన కొన్ని క్షణాలకే కూలిన హెలికాప్టర్.. ముగ్గురు దుర్మరణం మహారాష్ట్రలో హెలికాప్టర్ ప్రమాదానికి గురైన ఘటన చోటుచేసుకుంది. ఉదయం 6:45 నిమిషాలకు పూణెలో బయలుదేరిన హెలికాప్టర్ క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. పొగమంచు వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. By Kusuma 02 Oct 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి మహారాష్ట్రలోని పూణెలో హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. బయలుదేరిన కొన్ని క్షణాల్లోనే హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. పుణెలో ఆక్సస్‌ఫర్డ్ గోల్ఫ్‌క్లబ్ హెలిప్యాడ్ నుంచి బయలు దేరిన హెలికాప్టర్ బావ్‌దాన్ దగ్గర రెండు కొండల మధ్య కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇది కూడా చూడండి: విషాదం.. కాల్వలో ముగ్గురు గల్లంతు Helicopter Crashes in Pune’s Bavdhan Area, Three Feared DeadPune, 2nd October 2024: A helicopter crash occurred in the Bavdhan area early this morning, leaving three people critically injured and feared dead. The helicopter crashed near HEMRL shortly after taking off from the… pic.twitter.com/bcDFapGfRt — Punekar News (@punekarnews) October 2, 2024 పొగమంచు కారణంగా.. హెలికాప్టర్‌లో ఇద్దరు పైలెట్లు, ఇంజినీర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈరోజు ఉదయం 6:45 నిమిషాలకు పుణెలో బయలు దేరిన విమానం టేకాఫ్ అయిన వెంటనే కుప్పకూలిపోయింది. పొగ మంచు విపరీతంగా ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ పూర్తిగా కాలిపోయింది. మృతుల వివరాలు, హెలికాప్టర్ ప్రైవేట్ లేదా ప్రభుత్వానిదా అనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇది కూడా చూడండి: ఘోర ప్రమాదం.. 23 మంది దుర్మరణం #helicaptor-crash మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి