Baba Siddique case: 700 మందికి పైగా షూటర్లతో బిష్ణోయ్‌కి సంబంధాలు!

మ‌హారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ దారుణ హత్య నేపథ్యంలో లారెన్స్ బిష్ణోయ్‌కి సంబంధించి షాకింగ్ నిజాలు బయటకొస్తున్నాయి. దేశవ్యాప్తంగా బిష్ణోయ్‌కి 700 మందికి పైగా షూటర్లతో సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. ఖలిస్థాన్ సంస్థలతో సంబంధాలున్నట్లు NIA వెల్లడించింది.

New Update
bh

Baba Siddique case: మ‌హారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. సిద్ధిఖీని హత్య చేసింది తామే అంటూ లారెన్స్ బిష్ణోయ్‌ గ్యాంగ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్‌ అవుతుండగా.. తాజాగా మరో షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఈ మేరకు లారెన్స్ బిష్ణోయ్ భారతదేశం అంతటా వందల సంఖ్యలో షూటర్లతో సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. 

700 మందికి పైగా షూటర్లతో సంబంధాలు..


ఈ మేరకు తీహార్ జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌పై హత్య, దోపిడీతో సహా రెండు డజన్లకు పైగా క్రిమినల్ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు అతని గ్యాంగ్ కు దేశవ్యాప్తంగా 700 మందికి పైగా షూటర్లతో అనుబంధంగా ఉందని నిర్దారించారు. బిష్ణోయ్, అతని సహచరుడు గోల్డీ బ్రార్‌కి ఖలిస్థాన్ అనుకూల సంస్థలతో సంబంధాలున్నాయని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) నివేదిక వెల్లడించింది.

పదుల సంఖ్యలో ఎఫ్ఐఆర్ లు..


అలాగే బిష్ణోయ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హర్యానా రాజస్థాన్‌లోని దాదాపు డజను ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితుల్లో ఒకరైన ప్రస్తుతం జైలులో ఉన్న బిష్ణోయ్‌తో సంబంధాలున్న కొందరు అనుమానితుల నివాస ప్రాంగణాలపై ఈడీ దాడులు చేసింది. ఈ క్రమంలోనే 2010, 2012 మధ్య కాలంలో బిష్ణోయ్ తన నేర కార్యకలాపాలను చండీగఢ్‌లో ప్రారంభించాడని వెల్లడించింది. అతనిపై హత్యాయత్నం, అతిక్రమణ, దాడి దోపిడీ వంటి నేరాలకు సంబంధించి అనేక ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు తెలిపింది. చండీగఢ్‌లో అతనిపై నమోదైన 7 ఎఫ్‌ఐఆర్‌లలో 4 కేసుల్లో నిర్దోషిగా విడుదల కాగా 3 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించింది.

రాకీని కాల్చి చంపి..
ఇక జైలులో ఉన్న సమయంలో బిష్ణోయ్ పలువురు నేరస్తులతో పొత్తులు పెట్టుకున్నాడు. జైలునుంచి విడుదలైన తర్వాత అతను ఆయుధ వ్యాపారులు, స్థానిక నేరస్థులను కలిశాడు. ఈ క్రమంలోనే అతని ముఠాతో సంబంధం ఉన్న వ్యక్తుల సంఖ్య పెరిగింది. 2013లో ముక్త్‌సర్‌లోని ప్రభుత్వ కళాశాల ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి లూథియానాను కాల్చి చంపాడు. ఆ తర్వాత అతను గ్యాంగ్‌స్టర్‌గా మారిన రాజకీయవేత్త జస్విందర్ సింగ్ (అలియాస్ రాకీ)తో స్నేహం చేసి.. రాకీని జైపాల్ భుల్లర్ 2016లో కాల్చి చంపాడు. 

జైలు నుంచి వాయిస్ ఓవర్ IP కాల్‌.. 
భరత్‌పూర్ జైలులో ఉన్న సమయంలో బిష్ణోయ్ జైలు సిబ్బంది నుండి సహాయం పొందుతూ తన సిండికేట్‌ను నిర్వహించాడు. మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA) కింద అతనిపై నమోదైన కేసుకు సంబంధించి 2021లో ఢిల్లీలోని తీహార్ జైలుకు బదిలీ చేయబడ్డాడు. ఆ తర్వాత జైలు బయట తన సహచరులతో కమ్యూనికేట్ చేయడానికి బిష్ణోయ్ వాయిస్ ఓవర్ IP కాల్‌లను ఉపయోగించినట్లు బయటపడింది. 2018లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్‌ను హత్య చేయమని చెప్పినట్లు బిష్ణోయ్ సన్నిహితుడు సంపత్ నెహ్రా పోలీసులకు తెలిపాడు. 

సిద్ధూ మూసేవాలా హత్య
2022మే 29న పంజాబ్‌లోని మాన్సాలో పంజాబీ గాయకుడు సిద్ధు మూసేవాలాను బిష్ణోయ్‌ గ్యాంగ్ కాల్చి చంపారు. ఈ కాల్పులు జరిగిన సమయంలో బిష్ణోయ్ తీహార్ జైలులో ఉన్నాడు.

సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్య
రైట్ వింగ్ గ్రూప్ రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి డిసెంబర్ 5న జైపూర్‌లో తన ఇంటి గదిలో కాల్చి బిష్ణోయ్ గ్యాంగ్ చేత చంపబడ్డాడు. మొదట గోగమేడితో కలిసి అతని ఇంట్లో టీ తాగిన దుండగులు.. అక్కడే కాల్చి చంపిన వీడియోలు వైరల్ అయ్యాయి. దుండగుల ఎదురుకాల్పుల్లో గోగమేడి సెక్యూరిటీ గార్డుల్లో ఒకరికి కూడా బుల్లెట్ గాయాలు అయ్యాయి. బిష్ణోయ్ ముఠా సభ్యుడు రోహిత్ గోదారా హత్యకు బాధ్యత వహించాడు. ఈ హత్యకు పూర్తి బాధ్యత తనదేనని ఫేస్‌బుక్ పోస్ట్‌లో గోదార క్లారిటీ ఇచ్చాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు