హైదరాబాద్ ఫిలింనగర్‌లో భారీ చోరీ.. 34 తులాలు కొట్టేసిన దుండగులు

హైదరాబాద్ ఫిలింనగర్‌లో చోరీ జరిగింది. ఓ కుటుంబం ఇఫ్తార్ విందుకు వెళ్లి వచ్చేసరికి ఇంట్లో ఉన్న డబ్బు, బంగారం, నగలు అన్ని దోచేశారు. తలుపులు పగలు గొట్టి 34 తులాల బంగారం, 4.5 లక్షలు, 550 కెనడియన్ డాలర్లను దుండగులు తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

New Update
gold

gold

హైదరాబాద్‌లో భారీ చోరీ జరిగింది. ఫిలింనగర్‌లో ఉంటున్న ఓ కుటుంబం ఇఫ్తార్ విందుకు వెళ్లి వచ్చేసరికి ఇంట్లో ఉన్న డబ్బు, బంగారం, నగలు అన్ని దోచేశారు. తలుపులు పగలగొట్టి ఎన్‌ఆర్‌ఐ ఇంట్లోకి ప్రవేశించి కొట్టేశారు. షేక్‌పేటకి చెందిన మహ్మద్ ముజాహిద్ కమల్ కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. అయితే ఇటీవల హైదరాబాద్‌కి వచ్చారు. రంజాన్ మాసం కావడంతో ముజాహిద్ బంధువుల ఇంటికి కుటుంబ సభ్యులతో కలిసి ఇఫ్తార్ విందుకు వెళ్లారు.

ఇది కూడా చూడండి: Tulsi Gabbard: భారత్ లో ఉంటే ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది

ఇళ్లంతా చిందరవందరగా చేసి..

తెల్లవారు జామున 2 గంటలకు ఇంటికి వచ్చే సరికి తలుపులు పగలగొట్టిన, ఇళ్లంతా చిందరవందరగా కనిపించింది. ఇంటి లోపలికి వెళ్లి చూడగా మొత్తం చిందరవందర చేసి 34 తులాల బంగారం, 4.5 లక్షల డబ్బు, 550 కెనడియన్ డాలర్లు తీసుకెళ్లారు. అయితే దొంగతనం చేసే ముందు దుండగులు సీసీ కెమెరాలు, డీవీఆర్ అన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: IPL 2025: రోహిత్ శర్మ కెప్టెన్సీపై పంజాబ్ కింగ్స్ బ్యాటర్ షాకింగ్ కామెంట్స్.. తన కోరిక అదేనంటూ!

ఇది కూడా చూడండి: Trump-Biden: బైడెన్ చేసిన క్షమాభిక్షలు చెల్లవు అంటున్న ట్రంప్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు