Fire Accident: లేడీస్ హాస్టల్‌లో AC పేలి భగ్గుమన్న మంటలు.. బాల్కనీ నుంచి దూకిన అమ్మాయిలు (VIDEO)

ఉత్తరప్రదేశ్‌ నోయిడాలోని గర్ల్స్ హాస్టల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నాలడ్జ్‌ పార్క్‌ 3 సమీపంలోగల అన్నపూర్ణ గర్ల్స్‌ హాస్టల్‌లో ఏసీ నుంచి మంటలు అంటుకున్నాయి. హాస్టల్‌లో ఉన్న అమ్మాయిలు బాల్కనీ నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు.

New Update
Fire Broke out Girls Hostel

Fire Broke out Girls Hostel Photograph: (Fire Broke out Girls Hostel)

Fire Accident: ఎయిర్ కండీషనర్ పేలుడు(AC Blast) కారణంగా గర్ల్స్ హాస్టల్‌(Girls Hostel)లో మంటలు చెలరేగాయి. ఉత్తరప్రదేశ్‌ నోయిడాలో(Uttar Pradesh Noida) భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గ్రేటర్‌ నోయిడాలోని నాలడ్జ్‌ పార్క్‌ 3 సమీపంలోగల అన్నపూర్ణ గర్ల్స్‌ హాస్టల్‌లో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. హాస్టల్ గదుల్లో మంటలు వ్యాపించడంతో యువతులు బిల్డింగ్ బాల్కనీ నుంచి కిందకి దూకి ప్రాణాలు రక్షించుకున్నారు.

Also Read: విమానంలో మహిళలతో యువకుడి అసభ్య ప్రవర్తన.. దిగగానే ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!

Also Read: Mosquitoes: మనిషి రక్తాన్ని విషంగా మార్చి.. దోమల్ని చంపే ప్రయోగంలో సైంటిస్టులు సక్సెస్

Also Read: BIG BREAKING: బ్యాంకాక్‌లో భారీ భూకంపం.. నేలమట్టమైన భవనాలు

ఏసీ పేలడం వల్లే

ఏసీ పేలడం వల్లే మంటలు చెలరేగినట్లు సమాచారం. ఇద్దరు విద్యార్థులు మాత్రం రెండో అంతస్తులో చిక్కుకుపోయారు. స్థానికులు నిచ్చెన సాయంతో వారిని రక్షించారు. ఈ క్రమంలో ఓ బాలిక కిందకు దిగుతుండగా జారి పడిపోయింది. స్వల్ప గాయాలతో బయటపడ్డారు. హాస్టల్ విద్యార్థినీలు బాల్కనీ నుంచి దూకి కిందకి దిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Also Read: ఉగాది ఆఫర్లు.. IPHONE 15_ 6/512జీబీ ధర భారీగా తగ్గింపు- డోంట్ మిస్!
Advertisment
Advertisment
Advertisment