71 ఏళ్ళ వృద్ధుడికి కుచ్చుటోపి.. 1.4 కోట్ల రూపాయలు దోచేసిన కేటుగాళ్లు!

డిజిటల్ అరెస్టు మోసానికి మరో వృద్ధుడు బలయ్యాడు. 71ఏళ్ళ వృద్ధుడి నుంచి 1.4 కోట్ల రూపాయలు కాజేశారు సైబర్ కేటుగాళ్లు. మీ అకౌంట్ కు సంబంధించి భారీ కుంభకోణం జరిగిందని.. బెదిరించి డబ్బులు దోచుకున్నారు. ఈ ఘటన అనకాపల్లిలో చోటుచేసుకుంది.

New Update
digital arrest

digital arrest

Digital Arrest : సైబర్ నేరాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. డిజిటల్ అరెస్టు అంటూ కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ కేటుగాళ్లు. డిజిటల్ అరెస్ట్‌ పేరుతో అమాయకులను భయపెట్టి కోట్లల్లో డబ్బులు దోచుకుంటున్నారు. తాజాగా ఈ సైబర్ కేటుగాళ్లమోసానికి మరో వృద్ధుడు బలయ్యాడు. 

Also Read: నాగచైతన్య హల్దీ ఫంక్షన్ లో అఖిల్ ఏం చేశాడో చూడండి.. ఫొటో వైరల్!

రూ. 1.4 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్ళు 

అనకాపల్లి నర్సిపట్టణానికి చెందిన 71 సంవత్సరాల రిటైర్డ్ ఉద్యోగి నుంచి సైబర్ కేటుగాళ్లు ఏకంగా రూ.1.4 కోట్లు కాజేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ముందుగా నేరగాళ్లు.. మీ అకౌంట్ కు సంబంధించి భారీ కుంభకోణం జరిగింది. అందుకే మీరు డిజిటల్ అరెస్టు అయ్యారు అంటూ ఫోన్లో వృద్ధుణ్ని బెదిరించారు. ఈ అరెస్టు నుంచి తప్పించుకోవాలంటే డబ్బులు చెల్లించాలని బెదిరించారు. దీంతో భయపడిపోయిన వృద్ధుడు.. బ్యాంక్ లో దాచుకున్న ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులన్నీ విత్‌డ్రా  చేసి నేరగాళ్లకు పంపించాడు. రూ.1.4 కోట్లను మూడు రోజుల వ్యవధిలో నేరగాళ్లు చెప్పిన ఖాతాకు జమ చేశాడు వృద్ధుడు. 

Also Read: అయ్యో.. ఆ నర్సు గుర్తు పట్టకపోతే.. కులశేఖర్ చనిపోయిన విషయం కూడా తెలిసేది కాదు..! 

ఆ తర్వాత రెండు మూడు రోజులకు తాను మోసపోయినట్లు గుర్తించాడు వృద్ధుడు. 12 రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు  వృద్ధుడు పంపిన డబ్బు విత్‌డ్రా కాకుండా చేసినట్లు తెలిపారు. అలాగే నేరగాళ్ళను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. 

Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది?

Also Read :  కాకినాడ పోర్ట్ లో అసలు ఏం జరుగుతుంది?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Viral news: ముగ్గురు పిల్లల తల్లికి ఇంటర్ స్టూడెంట్‌తో మూడో పెళ్లి

ముగ్గురు పిల్లల తల్లి ఇంటర్ విద్యార్థిని పెళ్లి చేసుకుంది. ఇది ఉత్తరప్రదేశ్‌ అమ్రోహా జిల్లాలో జరిగింది. శివాణికి గతంలో 2 పెళ్లిళ్లు అయ్యాయి. ఏప్రిల్ 9న ఇంటర్మీడియేట్ స్టూడెంట్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వీరి పెళ్లి వరుడు ఫ్యామిలీ కూడా ఒకే చెప్పింది.

New Update
UP inter student marriage

ఆమె వయసు 30ఏళ్లు. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఆ మహిళ ఇంటర్మీడియేట్ సెకండ్ ఈయర్ విద్యార్థిని ప్రేమించింది. ఇది వరకే ఆమెకు రెండు పెళ్లిళ్లు కూడా అయ్యాయి. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో జరిగింది. షబ్నం అనే 30ఏళ్ల మహిళ బుధవారం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న 18 బాలుడిని పెళ్లి చేసుకుంది. ఆమె హిందూ మతంలోకి మారి శివానిగా పేరు మార్చుకొని అతన్ని వివాహం చేసుకుంది. ఈ సమాచారం ఆలస్యంగా అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. హసన్‌పూర్ సర్కిల్ ఆఫీసర్ దీప్ కుమార్ పంత్ వివరాల ప్రకారం.. శివాని అనే మహిళను గతంలో షబ్నం అని పిలిచేవారు. ఆమెకు తల్లిదండ్రులు లేరు. గతంలో రెండుసార్లు వివాహం చేసుకుంది. మరోసారి ఓ ఇంటర్ సెకండ్ ఈయర్ బాలుడితో గుడిలో వివాహం చేసుకుంది.

Also read: Instagram loveG: ప్రేమ గుడ్డిది మావా.. ఇన్‌స్టాగ్రామ్ లవర్ కోసం అమెరికా నుంచి ఆంధ్రా వచ్చిన యువతి

Also read: BIG BREAKING: ట్రం‌ప్‌కు చైనా బిగ్ షాక్.. అమెరికాపై 84శాతం ప్రతీకార సుంకాలు

ఉత్తరప్రదేశ్‌లో మతమార్పిడి నిరోధక చట్టం అమలులో ఉంది. ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధ మతమార్పిడి నిషేధ చట్టం, కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శివానీ మొదట మీరట్‌లో ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నారని, కానీ అతనితో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఆమె సైదన్‌వాలి గ్రామానికి చెందిన తౌఫిక్‌ను వివాహం చేసుకుంది. అతను 2011లో రోడ్డు ప్రమాదంలో వికలాంగుడిగా మిగిలిపోయాడు. ప్రస్తుతం షబ్నం (శివాని) సెకండ్ ఈయర్ విద్యార్థిని పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లికి ఆ అబ్బాయి కుంటుంబ కూడా ఒప్పుకుంది. దీంతో హిందూ సాంప్రదాయం ప్రకారం దేవాలయంలో మ్యారేజ్ చేసుకున్నారు.

Advertisment
Advertisment
Advertisment