చావుకు డప్పు కొట్టలేదని కుల బహిష్కరణ..19 మంది కుల పెద్దలు అరెస్ట్!

డప్పుకొట్టేందుకు రావట్లేదని కులపెద్దలు ఓ కుటుంబాన్ని బహిష్కరించిన ఘటన మెదక్ జిల్లా గౌతోజిగూడలో చోటుచేసుకుంది. బాగా చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడిన అన్నదమ్ములు చంద్రం, అర్జున్‌ను వెలివేయగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. 19 మంది పెద్ద మనుషులను అరెస్ట్ చేశారు.

New Update
drereff

Medak: మానవుడు నింగికి నిచ్చెన వేస్తున్న చోట కొంతమంది నిచ్చెన మెట్ల వ్యవస్థను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కులం, మతం, ప్రాంతం పేరుతో తోటి వారిని దూషిస్తూ నీచానికి దిగజారుతున్నారు. అంతేకాదు అన్యాయాన్ని ఎదురించినవారిపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. కుల సంప్రదాయాల పేరిట కుటుంబాలను కులం, గ్రామం నుంచి బహిష్కరిస్తూ కొంతమంది గ్రామ పెద్దలు తమ మూలాలను కాపాడుకునేందుకు ఎంతటికైనా తెగిస్తున్నారు. ఇలాంటి అమానవీయ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. గ్రామంలో చావులకు డప్పు కొట్టేందుకు రాలేదని దళిత కుటుంబాన్ని వెలివేసిన ఘటన ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. 

బాగా చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడిన అన్నదమ్ములు..

మెదక్ జిల్లా గౌతోజిగూడ నివాసులు పంచమి శంకరయ్య (2015లో చనిపోయారు), నర్సమ్మకు ఇద్దరు కుమారులు చంద్రం, అర్జున్‌. వీరిద్దరు కొంతకాలంగా గ్రామాన్ని వదిలి హైదరాబాద్ లో ఉంటున్నారు. చంద్రం మేడ్చల్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా.. అర్జున్ జేఎన్టీయూలో ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో MSC పూర్తిచేసి ఓ ఫార్మా కంపెనీలో కెమిస్ట్‌గా పని చేస్తున్నాడు. అయితే బాగా చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడటంతో గ్రామంలో డప్పు కొట్టే విధానానికి వీరు స్వస్తి పలికారు. 

అయితే ఇటీవల వీరిద్దరూ ఎవరి చావు, శుభకార్యాలకు డప్పు కొట్టేందుకు రావట్లేదని ఊరి నుంచి గ్రామ పెద్దలు వెలేశారు. ఊరిలో ఆ కుటుంబానికి ఎవరూ సహకరించకూడదని ప్రజలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో చంద్రం, అర్జున్ గ్రామస్థులతోపాటు పెద్ద మనుషులకు అర్థం చేయించేందుకు ప్రయత్నించినా వారు పట్టించుకోలేదు. దీంతో ఈ దారుణాన్ని అవమానంగా భావించిన అన్నదమ్ములు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే దీనిపై విచారణ జరిపిన పోలీసులు 19 మంది పెద్ద మనుషులను అరెస్ట్ చేశారు. మరో 14 మంది పరారిలో ఉండగా వారికోసం గాలిస్తు్న్నారు. ప్రస్తుతం ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు