హిందూ-ముస్లిం జంటలకు 50 శాతం డిస్కౌంట్.. CMR లవ్ జిహాద్ రచ్చ! దసరా సదర్భంగా CMR షాపింగ్ మాల్ ప్రకటించిన ఆఫర్ వివాదాస్పదమైంది. హిందూ-ముస్లిం జంటలకు 50 శాతం డిస్కౌంట్ ఇస్తామంటూ ప్రచారం చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ లోగోను మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎవరూ నమ్మొద్దని CMR తెలిపింది. By srinivas 09 Oct 2024 in క్రైం మహబూబ్ నగర్ New Update షేర్ చేయండి CMR Love jihad: దసరా పండుగ సదర్భంగా CMR షాపింగ్ మాల్ ప్రకటించిన ఆఫర్ వివాదాస్పదమైంది. మతాంతర వివాహాలు చేసుకున్న హిందూ-ముస్లిం జంటలకు ప్రత్యేక డిస్కౌంట్ ఇవ్వడం లవ్ జిహాద్ రచ్చకు దారితీసింది. ఈ మేరకు హిందూ-ముస్లిం జంటలకు 10 నుంచి 50 శాతం డిస్కౌంట్ ఇస్తామంటూ సీఎంఆర్ ప్రచారం చేయడం దుమారం రేపుతోంది. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌లలో హోర్డింగులు పెట్టడంతోపాటు ఉర్దూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చినట్లు తెలుస్తుండగా దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న చర్చ నడుస్తోంది. What are they trying to promote ?The hoarding in Telangana is clearly promoting love jihad This hoarding has to get down pic.twitter.com/HQHkxojPpR — Sheetal Chopra 🇮🇳 (@SheetalPronamo) June 9, 2023 ఈ మేరకు సీఎంఆర్ షాపింగ్ మాల్ లవ్ జిహాద్‌ను ప్రోత్సహిస్తోందంటూ పలువురు మండిపడుతున్నారు. CMR బోర్డింగ్ పై ముస్లీం టోపీ ధరించిన యువకుడు, హిందూ సంప్రదాయ చీర, బొట్టు పెట్టుకున్న యువతి దర్శనమివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై స్పందించిన సీఎంఆర్ యాజమాన్యం.. ఇది 2023 నాటిదని, దానితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. తమ లోగోను మార్ఫింగ్ చేసి అప్పట్లో తప్పుడు ప్రచారం చేశారని, దీనిని నమ్మొద్దంటూ CMR చైర్మన్ చందన మోహనరావు తెలిపారు. #cmr #love-jihad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి